మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ లో రెండు పోస్టులకు ఆహ్వానం…….

వెంకటాపూర్,జూన్09(జనం సాక్షి):-ములుగు జిల్లా లోని మోడల్ స్కూల్ గర్ల్స్ హాస్టల్ జవహర్ నగర్ లో ఖాళీగా ఉన్న ఒక కేర్ టేకర్,మరియు ఒక మహిళా వాచ్మెన్ పోస్ట్ కు ఖాళీలను భర్తీ చేయుటకు కొరకు నోటిఫికేషన్ ను విడుదల చేయడం జరిగింది.కేర్ టేకర్ కం వార్డెన్ పోస్ట్ కు మహిళా అభ్యర్థి అయి ఉండాలి.విద్యార్హతలు డిగ్రీ మరియు బీఈడీ లేదా డిఈడీ విద్యార్హత కలిగి ఉండాలి.వయసు 25 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు కలిగి ఉండాలి.ఎస్సీ,ఎస్టీ, బీసీలకు ఐదు సంవత్సరాల వయసు రిలేషన్ కలదు.మహిళా వాచ్మెన్ పోస్ట్ కు విద్యార్హతలు పదవ తరగతి చదివి ఉండాలి.సెక్యూరిటీ ఏజెన్సీ నుంచి ట్రైనింగ్ తీసుకొని ఉండాలి.అలాగే ములుగు జిల్లా వాస్తవ్యులు అయి ఉండాలని ములుగు జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సిద్ధార్ద్ రెడ్డి తెలియజేశారు.కేర్ టేకర్ ధరఖాస్తులను 9వ తేదీ నుండి 16వ తేదీ సాయంత్రం 3.00 గంటల వరకు వారి వారి సంబందిత మండల కార్యాలయములో సమర్పించగలరనీ జిల్లా విద్యాశాఖాధికారి ఎ.సిద్ధార్థ రెడ్డి తెలియజేశారు.ఇతర వివరముల కొరకు జిఈసివో బి.రజిత, యొక్క ఫోన్ నెంబర్ ను 9666294715 సంప్రదించగలరు.