పెద్ద వాల్గోట్ గ్రామ కాంగ్రెస్ నూతన కమిటీ నియామకం

సిరికొండ, జూలై 21 (జనం సాక్షి): సిరికొండ మండలం పెద్ద వాల్గోట్ గ్రామ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా జాగిరపు సురేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా షేక్ అసీబ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు నూతనంగా నియమితులైన నాయకులను అభినందిస్తూ, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. గ్రామాభివృద్ధితో పాటు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా సమిష్టిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ అధ్యక్షులు పిట్ల నర్సింగ్, ఉపసర్పంచ్ తలకట్ల రాము, కిసాన్ కేతు అధ్యక్షులు గాదారి నర్సరెడ్డి, మాజీ ఎంపీటీసీ గద్దల భూమయ్య, ఇందిరమ్మ కమిటీ సభ్యులు దూస రమేష్, తలకట్ల శ్రీనివాస్, వడియాల శేఖర్ రెడ్డి, షేక్ వాజిద్, భూమా రెడ్డి తదితరులు పాల్గొని నూతన అధ్యక్ష, ఉపాధ్యక్షులను శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

తాజావార్తలు