నన్ను ఆశీర్వదించండి రూపు రేఖలు మారుస్తా

పిట్లం డిసెంబర్ 07(జనం సాక్షి)
పిట్లం సర్పంచ్ అభ్యర్థి నవాబ్ సుదర్శన్ గౌడ్
స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజాసేవయే లక్ష్యంగా గ్రామ ప్రజలందరికీ సహకారంతో సర్పంచ్ అభ్యర్థిగా గ్రామ పంచాయతీ సర్పంచ్ బరిలో నిలబడ్డానని ఆదివారం నాడు పిట్లం గ్రామంలో ఇంటింటా ప్రచారంలో భాగంగా ఎన్నికలలో తనను ఆశీర్వదించి దీవించాలి అని కోరారు. తాను సర్పంచ్ గా గెలవగానే గ్రామంలో ఉన్న డ్రైనేజీ వ్యవస్థ సీసీ రోడ్లను గ్రామాభివృద్ధికి పాటుపడతానన్నారు. చిన్ననాటి నుంచి ప్రజాసేవలో తన కుటుంబం ఉందని గ్రామంలో మంచి చెడులకు అందుబాటులో ఉండి గ్రామ ప్రజలకు సేవ చేసుకుంటానని గ్రామస్తులు అందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎనగండ్ల శ్రీనివాస్ రెడ్డి , కొవ్వూరి శివ, గులాని సాయిలు, సాజీద్ లాలా తదితరులు పాల్గొన్నారు



