ఆశీర్వదించండి వార్డు అభివృద్ధే లక్ష్యం

10వ వార్డ్ అభ్యర్థి చేరాల లహరి కిరణ్
భూదాన్ పోచంపల్లి, ఫిబ్రవరి 9 (జనం సాక్షి): మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో బీఆర్ఎస్ అభ్యర్థి చేరాల లహరి కిరణ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు.
నన్ను ఆశీర్వదిస్తే స్థానికంగా ఉంటూ వార్డులోని ప్రతి సమస్యపై దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా స్వంత డబ్బుతో ఆడపిల్లల పెళ్లికి రూ.10,116 ఆర్థిక సాయం అందజేస్తానని హామీ ఇచ్చారు.



