అనూహ్య రీతిలో ముందున్న పార్టీ ఏది

– ఆర్మూర్ లో పోటీ..? హైదరాబాద్ లో దోస్తానా
ఆర్మూర్,ఫిబ్రవరి 9 (జనంసాక్షి):ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల వివిధ పార్టీ నాయకుల ప్రచార పర్వం రసవత్తరంగా కొనసాగుతుంది.బిజెపి,
బిఆర్ఎస్,కాంగ్రెస్, ఇండిపెండెంట్ ల అభ్యర్థులు బరిలో ఉండి పోటాపోటీ కనబరుస్తున్నారు.
ప్రధానంగా ఎన్నికల్లో ఓ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మున్సిపల్ చైర్మన్ పీఠం దక్కించుకోవాలన్న ఉద్దేశంతో ఆ వార్డులో బిజెపి అభ్యర్థిని నిలపకపోవడం కమలం పార్టీని చితికెలా పడేలా చేసింది.ఈ ప్రచారం కాస్త మున్సిపల్ ప్రజలందరికీ బట్టబయలు కావడంతో ఆర్మూర్ లో పోటీ.. హైదరాబాదులో దోస్తానా అని ఆ నేతల తీరు ప్రజలకు బట్టబయలైంది.బలమైన అభ్యర్థులు బిజెపి పార్టీలో నిలవకపోవడంతో అగ్ర తాంబూలం పుచ్చు కోవాల్సిన బిజెపి ఆరు స్థానాలకు మించి మున్సిపల్ కౌన్సిలర్ గా గెలవలేరని పబ్లిక్ టాక్ నడుస్తుంది.వ్యూహంగా పక్క ప్రణాళికగా బిఆర్ఎస్ పార్టీ ప్రచారం గట్టి అభ్యర్థులను ముందే పట్టుకోవడంతో బిఆర్ఎస్ పార్టీకి పదికి పైగా స్థానాలు దక్కించుకునేలా అవకాశాలు కనిపిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీకి సర్వేలతో టికెట్లు కేటాయింపు జరిగిన, ప్రతి అభ్యర్థి విషయంలో పక్కగా జరగకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి మిగతా స్థానాలు దక్కేలా కనబడుతుంది.కాంగ్రెస్ ఉన్నత శ్రేణి నాయకులు మున్సిపల్ ఎన్నికలకు ప్రచారం చేసిన ఫలితం మాత్రం మిగతా స్థానాలు అని వార్డు ప్రజలు ఖరారు చేస్తున్నారు.ఏది ఏమైనా ఇంకాస్త గట్టిగా ప్రయత్నిస్తే మార్పులు,చేర్పులు జరిగే అవకాశం ఉందని ప్రజలు అంటున్నారు.


