ట్రాక్టర్ను ఢీ కొట్టిన కారు

బూర్గంపహాడ్ మే 12 (జనంసాక్షి) : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలం సారపాక ఐటిసి వెస్ట్ గేట్ వద్ద జమాయిల్ పుల్ల ట్రాక్టర్ మలుపు తీసుకుంటుండగా వెనుక నుండి వచ్చిన కారు పుల్ల డాక్టర్ను బలంగా ఢీ కొట్టింది. జామాయిల్ లోడుతో వెళుతున్న ట్రాక్టర్ సడన్ బ్రేకు వేయడంతో వెనుక నుంచి కారు ఢీ కొట్టిన ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా ఒకరి పరిస్థితి పరిస్థితి విషమంగా ఉన్నదని సమాచారం. గాయపడిన వ్యక్తి శివకుమార్ రెడ్డి పరిస్థితి విషమంగా ఉన్నందువల్ల హుటాహుటిన భద్రాచలం ప్రభుత్వ హాస్పటల్ కు తరలించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం శివ కుమార్ రెడ్డిని హైదరాబాద్ కు తరలించారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.