గవర్నర్‌ను కలిసిన భాజపా, తెరాస నేతలు
హైదరాబాద్: భాజపా, తెరాస పార్టీ నేతలు ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: భాజపా, తెరాస పార్టీ నేతలు ఈ రోజు మధ్యాహ్నం గవర్నర్ నరసింహన్‌ను కలిశారు. తెలంగాణ కవాతుకు అనుమతి ఇవ్వాలని వారు గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్: జాషువా జీవిత సాఫల్య పురస్కారానికి తుమ్మపూడి కోటేశ్వరరావు ఎంపికయ్యారు. ఆచార్య ఎండ్లూరు సుధాకర్‌కు జాషువా విశిష్ట పురస్కానం లభించగా, డాక్టర్ ముక్తేవి భారతి జాషువా విశిష్ట మహిళా పురస్కారానికి ఎంపికయ్యారు.
ఢిల్లీ: 2జీపై తీర్పు కేవలం స్పెక్ట్రమ్ కేటాయింపులకే పరిమితమని ఇతర సహజ వనరులకు ఇది వర్తించదని సుప్రీంకోర్టు పేర్కొంది, సహజవనరుల కేటాయింపులకు వేల పద్థతి రాజ్యాంగపరమైన నిర్ణయాధికారం కాదని పేర్కొంది. సహజవనరుల కేటాయింపులో అత్యధిక లాభాల పెంపు ప్రాతిపదిక…
ఛత్తీస్‌గఢ్: బీజూపూర్ జిల్లా ఆవుపల్లి సంతలో ఒక కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కత్తితో పొడిచారు. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. బీజాపూర్ జిల్లా మోత్కుపాల్లో నలుగురు, మోర్తూరులో ఇద్దకు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు.
క్యాండి: టీ 20 ప్రపంచకప్ సూపర్ 8లో తొలిమ్యాచ్ ఇంకాసేపట్లో ప్రారంభం కానుంది. శ్రీలంక న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే ఈ మ్యాచ్‌కి టాన్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. శ్రీలంకలోని పల్లెకెలె ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో…
హైదరాబాద్: నగర బులియన్ మార్కెట్లో ఈ రోజు నమోదైన వెండి, బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,720. 22 క్యారట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30,800కిలో…
హైదరాబాద్: సచివాలయం ప్రాంగణంలో అధికారులు 144వ సెక్షన్ విధించారు. బహిరంగ సభల నిర్వహణ, నినాదాలు, వూరేగింపులు, ప్రదర్శనలపై నిషేధం విధించారు. ఈ ఏడాది నవంబరు 18 వరకు నిషేధాజ్ఞలు కొనసాగుతాయి.
కరీంనగర్: నిజామాబాద్ జిల్లాలో అరెస్టు చేసిన ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావును పోలీసులు కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు తరలించారు. పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపిస్తూ పోలీసు స్టేషన్ ఎదుట తెరాస కార్యకర్తలతో కలిసి విద్యాసాగర్ ఆందోళనకు దిగారు.
హైదరాబాద్ : తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా ఓయూ విద్యార్థి ఐకాస తలపెట్టిన విద్యార్థి కవాతు ఓచూ అర్ట్స్ కళాశాల నుంచి ప్రారంభమైంది. కవాతు సందర్బంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా ఓయూలో భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
హైదరాబాద్: ప్రత్యేక తెలంగాణ కోరుతూ ఈ నెల 30న తెలంగాణ రాజకీయ ఐకాస తలపెట్టిన ‘ తెలంగాణ మార్చ్’కు తెలంగాణ తెదేపా ఫోరం మద్దతు తెలిపింది. మార్చ్‌కు మద్దతుగా శుక్ర, శనివారాల్లో తెలంగాణలోని అన్ని మండల కేంద్రాల్లో ర్యాలీలు…