Saturday, 14 November 2026

హైదరాబాద్

పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గించాలని తెలుగుదేశం ఆందోళన

గుంటూరు: పెంచిన ఆర్టీసీ ఛార్జీలను, తగ్గించాలని డిమండ్‌ చేస్తూ తెలుగుదేశం రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకు దిగింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో బస్‌డిపో ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఈ ఆందోళనతో దిల్‌సుఖ్‌నగర్‌లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. గుంటూరు జిల్లా చిలకలూరి…

ప్రజాసంఘాలను అణచివేయాలని చూస్తే అది ప్రతిఘటనకు దారితీస్తుంది: అరుంధతీరాయ్‌

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారం కోసం ఉద్భవించిన మహిళా ఉద్యమ సంస్థలన్నీ కాలక్రమేణా స్వచ్ఛంద సంస్థలుగా మారుతున్నాయని ప్రముఖ రచయిత్రి, సామాజిక ఉద్యమకారిణి అరుంధతీ రాయ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. సుందరయ్య విజ్ఞాన్‌భవన్‌లో జరిగిన విప్లవ ప్రజాస్వామిక సంఘటన (ఆర్‌డీఎఫ్‌)…

ఛార్జీలు పెంచినా ఏడాదికి రూ.372 కోట్లు నష్టం : ఏకే ఖాన్‌

హైదరాబాద్‌: ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు పెంచేందుకే ఛార్జీలు పెంచినట్లు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ తెలిపారు. ఈ ఏడాది రెండు వేల కొత్త బస్సులను ప్రవేశ పెడుతున్నట్లు ఆయన చెప్పారు. ఛార్జీలను స్వల్పంగానే పెంచామని ఆయన పేర్కొన్నారు. ఛార్జీలు…

న్యూజిలాండ్‌ లక్ష్యం 178

పల్లెకెలె: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా న్యూజిలాండ్‌, పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 177 పరుగులు చేసింది. టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ కెప్టెన్‌ హఫీజ్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. ఓపెనర్లు…

ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

హైదరాబాద్‌: సీబీఐ, ఏసీబీ అధికారులు ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. అవినీతి కేసుల దర్యాప్తులో పరస్పర సహకారానికి ఈ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

ఎఫ్‌డీఐలతో భారత వ్యాపార రంగం విదేశీ సంస్థల హస్తగతం

విజయవాడ: విదేశీ సంస్థలు పెద్దయెత్తున లంచాలు ఇచ్చి, లాబీయింగ్‌ చేసి, భారత వ్యాపారంగాన్ని హస్తగతం చేసుకోవడానికి సద్దమైనాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఈరొజు విజయవాడలో గాంధీనగర్‌ ఛంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ‘రిటైల్‌ రంగంలో విదేశీ పెట్టుబడులు,…

సిక్కింలో కోండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

  గ్యాంగ్‌ టాక్‌ ఈ శాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌ తాంగ్‌ ప్రాంతంలో కోండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ)…

ప్రజలపై మరింత భారం వేయడం సరికాదు:సీఎంకు రాఘవులు లేఖ

హైదరాబాద్‌: డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌ సిలిండర్ల కుదింపు సమస్యలతో సతమ తమవుతున్న ప్రజలపై వ్యయసర్దుబాటు పేరుతో మరింత భారం వేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలనే…

ఇందూరులో ‘ మార్చ్‌’ సన్నాహక కవాతు

నిజామాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు సన్నాహక కవాతు ఈ రోజు ఇందూరు నగరంలో జరిగింది. నెహ్రూెపార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అమరవీరుల ఆశయాలు సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రారంభమైన కవాతు తెలంగాణ…

బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్ధాన్‌

పల్లెకెలె: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో నేటి తొలిమ్యాచ్‌లో న్యూజిలాండ్‌ల- పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.