Saturday, 14 November 2026

హైదరాబాద్

కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాంపై కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్‌ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 153, 153(ఏ) సెక్షన్‌ల…

జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లతో సీఎం ముఖాముఖి

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లు సమర్థమైన పాత్ర పోసించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యుట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్టిఆలిటీ మేనేజ్‌మెంట్‌లో ఆయన వాలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ పొందుతున్న…

మహిళలకోసం ఎన్నో చట్టాలు ఉన్నా వాటి అమలులో లోపాలు జాప్యం: సుభాషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: దశాబ్దాలుగా మహిళలు ఇంటా బయటా వివక్షకు గురవుతూనే ఉన్నారని మానవహక్కుల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అన్నారు. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన అంకురం వ్వవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకోసం ఎన్నో చట్టాలు…

బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను సీబీఐ సోమవారం ప్రశ్నించింది. ఏఎంఆర్‌కు మహా రాష్ట్రలోని బందేర్‌ బొగ్గు బ్లాక& కేటాయింపు వ్వవహారంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. గతంలో తనకు…

తెలంగాణ మార్చ్‌ గురించి ఎంపీ వివేక్‌ నివాసంలో కాంగ్రెస్‌ నేతల సమావేశం

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో ఈరోజు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు సమావేశమయ్యారు. తెరాస తెలంగాణ మార్చ్‌ గురించి తాము అందులో పోసించవలసిన పాత్ర గురించి చర్చించేందుకు సమావేశమైనట్లు తెలుస్తూంది. ఈ సమావేశానికి మంత్రులు జానారెడ్డి, సారయ్య, ఎంపీలు…

జైళ్లశాఖలోని వార్డర్స్‌ పరిక్ష తుది ‘కీ’ విడుదల

హైదరాబాద్‌: జైళ్లశాఖలోని వార్డన్స్‌ ఎంపికకు సంబంధించి పురుష, మహిళా అభ్యర్థులకు నిర్వహించిన అర్హత పరీక్ష తుది ‘కీ’ విడుదల చేసినట్లు పోలీసు నియామక బోర్డు ఛైర్మన్‌ మాలకొండయ్య సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్ధులుwww.apstatepolice.org వెబ్‌సైట్‌లో జవాబులు చూడొచ్చని…

పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్‌ అధికారుల నియామకం

హైదరాబాద్‌: పురపాలకశాఖలో సంబంధిత విభాగాలకు విజిలెన్స్‌ అధికారులను నియమించారు. ఈ మేరకు మంగళవారం పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి బి.శ్యాంబాబు ఉత్తర్వులు జారీచేశారు.

సీనియర్‌ ఐపీఎస్‌ ఉమేషకుమార్‌ సస్పెన్షన్‌ ఎత్తివేస్తూ ఉత్తర్వులు

హైదరాబాద్‌: సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఉమేష్‌కుమార్‌ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం ఈరోజు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఉమేష్‌కుమార్‌ వెంటనే విధుల్లో చేరాలని జీఓ జారీ చేశారు.

ఎంపీ కావూరి ఇంటిపై తెలంగాణ న్యాయవాదుల దాడి

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని ఎంపీ కావూరి సాంబశివరావు ఇంటిపై తెలంగాణ న్యాయవాదులు దాడి చేశారు. ఇంటి ఆవరణలో ఉన్న పూలకుండీలను ధ్వంసం చేశారు. ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసునమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

బాణసంచాల తయారీకేంద్రం శివకాశిలో మరో అగ్నిప్రమాదం

చెన్నై: చెన్నై సమీపంలోని బాణసంచాల తయారీకేంద్రం శివకాశిలో ఇటీవల జరిగిన ఘోర అగ్నిప్రమాద ఘటనను మరువకముందే ఈ రోజు రాత్రి మళ్తీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. తయారైన బాణసంచాను లారీలో ఎక్కిస్తుండగా మంటలు చేలరేగాయి అని సమాచారం.