Saturday, 14 November 2026

హైదరాబాద్

హుస్సేన్‌సాగర్‌ వద్ద నిర్మాణాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు నోటీసులు

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ వద్ద సంజీవయ్య పార్కుకు సమీపంలో జీహెచ్‌ఎంసీ తలపెట్టిన నిర్మాణాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు సోవవారం ఆదేశించింది. హుస్సేన్‌సాగర్‌ జలాశయ ప్రాంతంలో చెత్త వాహనాల పార్కింగ్‌, నిర్వహణ, చెత్త నిల్వ కోసం…

భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలి

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భూదానోద్యమ భూముల దుర్వినియోగంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలంటూ జి.బాలాజీ, లింగమయ్య గౌడ్‌, సుధాకర్‌రెడ్డి అనే వ్యక్తులు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జైరాం రమేష్‌కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో భూదానోద్యమ భూములను కొందరు వ్యక్తులు తప్పుడు మార్గంలో…

బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించిన పాక్‌

ఇస్లామాబాద్‌: అణ్వాయుధంతో ఏడు వందల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగల బాబర్‌ క్రూయిజ్‌ క్షిపణిని పాకిస్థాన్‌ సోమవారం విజయవంతంగా ప్రయోగించి చూసింది. అత్యంత కచ్చితత్వంతో భూమి మీద లక్ష్యాలతో పాటు సముద్రంపైన ఉండే లక్ష్యాలనూ ఛేదించగల సామర్థ్యం దీనికి…

బళ్లారిలో ట్రాన్స్‌పోర్టు, ట్రేడర్స్‌ కార్యాలయాల్లో సీబీఐ తనిఖీలు

బళ్లారి: బెళెకెరి ఓడరేవులో ఖనిజం అక్రమ ఎగుమతుల కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ అధికారులు సోమవారం బళ్లారి నగరంలోని వివిధ ట్రాన్స్‌పోర్టు, ట్రేడర్స్‌ కార్యాలయాల్లో తనిఖీలు చేసినట్లు సమాచారం. సోమవారం ఉదయం అధికారులు రెండు వాహనాల్లో బళ్లారికి చేరుకొని…

సీఎం వ్యాఖ్యలు ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయి

హైదరాబాద్‌: హైదరాబాద్‌ విలీన దినోత్సవంపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యలు ఈ ప్రాంత ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని తెరాస నేత హరీశ్‌రావు అన్నారు. ముఖ్యమంత్రి తాను హైదరాబాదీ అని చెప్పుకొనే సమైక్యవాది అని విమర్శించారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నిజమైన హైదరాబాదీ…

అత్యవసర వైద్యసేవల నిర్వహణను సందర్శించిన అబ్దుల్‌ కలాం

హైదరాబాద్‌: అత్యవసర వైద్యసేవల నిర్వహణలో ఉన్న ఈఎంఆర్‌ఐ ప్రధాన కార్యాలయాన్ని మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం నేడు సందర్శించారు. దేశవ్యాప్తంగా అత్యవసర సేవల విభాగంలో 108 సర్వీసుల్ని నిర్వహిస్తున్న ఈఎంఆర్‌ఇ సంస్థకు అబ్దుల్‌కలాం గౌరవ చైర్మన్‌గా వ్వవహరిస్తున్నారు. ఈఎంఆర్‌ఐ…

తెలంగాణపై త్వరలో అఖిలపక్షం ఏర్పాటు

ఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేతలతో కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్వహించిన అత్యవసర సమావేశం ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌ వ్వవహరాలపై దాదపు గంటపాటు చర్చించిన నేతలు తెలంగాణపై త్వరలో అఖిలపక్షం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వాయలార్‌ రవి, గులాంనబీ ఆజాద్‌లు…

కోదండరాం ఇంటి ముట్టడి

హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్‌బాబుపై కోదండరాం చేసిన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలంటూ తెలంగాణ యువజన విద్యార్థి నాయకులు ఈరోజు సాయంత్రం ఆయన ఇంటిని ముట్టడించారు. కరీంనగర్‌ కవాతులో తెలంగాణ వ్యతిరేకులను ఉద్దేశించి మాట్లాడుతూ శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ విద్యార్థులు…

డిజిల్‌, వంటగ్యాస్‌ అభివృద్ది విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు: చిదంబరం

ఢిల్లీ: ప్రభుత్వం మరిన్ని కొత్త ప్రణాళికలు చేపట్టనుందని, అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం చెప్పారు. డీజిల్‌ ధరల పెంపుపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, చిల్లర వర్తకంలో విదేశీ పెట్టుబుడులపై…

గ్రూప్‌ – 1 మెయిన్స్‌ పరీక్షలు

హైదరాబాద్‌: రేపటినుంచి గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 28 వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. 2011 గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా 314 పోస్టులను భర్తీ చేసేందుకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి. మెయిన్స్‌ పరీక్షలకు 16,867…