Saturday, 14 November 2026

హైదరాబాద్

మినీ లారీతో సహా ఎర్రచందనం దహనం

తిరుపతి : తిరుపతి గ్రామీణ మండలంలోని పేరూరు చెరువులో మంగళవారం ఉదయం గుర్తుతెలియని వ్యక్తులు మినీ లారీతో సహా ఎర్రచందనం దుంగలను దహనం చేశారు. అక్రమంగా ఎర్రచందనం దుంగలను తరలిస్తున్నారన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు పేరూరు చెరువుకు చేరుకున్నారు.…

కళంకిత మంత్రులను తొలగించాలి: తెదేపా

హైదరాబాద్‌: ప్రభుత్వంలో కళంకిత మంత్రులు కొనసాగడంపై తెదేపా నిరసన వ్యక్తం చేసింది. శాసనసభ సమావేశాలు ఈ రోజు ప్రారంభం కాగానే ఆ పార్టీ నేత ఆశోకగజపతిరాజు మాట్లాడుతూ కళంకిత మంత్రులను ప్రభుత్వం నుంచి తొలగించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఓసీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ ఉన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం

నేటి నుంచి టీ -20 వరల్డ్‌ కప్‌

కొలంబో: టీ-20 వరల్డ్‌ కప్‌ పోటీలు ఈ రోజు నుంచి మహీంద్ర రాజపక్సే అంతరాజతీయ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో పన్నెండు జట్లు 27 మ్యాచ్‌లు ఆడుతాయి. 20 రోజులపాటు అంటే ఆక్టోబర్‌ 7 ఈ పోటీలు…

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స  పొందుతూ కవలలతోపాటు మరో చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు మృతి చెందరాని తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

గన్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్‌: ప్రభుత్వం నుంచి అవినీతి మంత్రులను తొలగించాలని తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్ద ఈ ఉదయం భైఠాయించి నిరసన చేపట్టారు. అవినీతి మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. వివిధమైన అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నిరసన…

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌: తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌  చేస్తూ తెరాస సభ్యులు రెండో రోజు కూడా శాసనసభలో ఆందోళనకు దిగారు. ఈ రోజు సమావేశాలలొ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన సభ్యులు నిరసనకు దిగారు. తెలంగాణపై వెంటనే…

తెలంగాణ మార్చ్‌కు టీఆర్‌ఎస్‌ సై

సెప్టెంబర్‌ మార్చ్‌ ఓ యుద్ధమే : హరీశ్‌ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి): సెప్టెంబర్‌ 30న తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ తలపెట్టిన ‘తెల ంగాణ మార్చ్‌’కు ఉద్యమ పార్టీ అయిన టీఆర్‌ఎస్‌ దూరంగా ఉంటుందా? అన్న ఉత్కంఠ వీడిపోయింది. జేఏసీతో…

తెలంగాణ తీర్మానానికి పట్టుబట్టిన టీఆర్‌ఎస్‌

కుదరదన్న సీఎం జాతీయ జెండాలతో హాజరైన టీఆర్‌ఎస్‌, బీజేపీ హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 17(జనంసాక్షి): అంతా అనుకున్నట్లుగానే జరిగింది. ఎలాంటి చర్చ జగరకుండానే అసెంబ్లీ తొలిరోజు ముగిసింది. విపక్షాల నినాదాలతో దద్దరిల్లింది. తొలి రోజే తెలంగాణ నినాదాలతో సభ మార్మోగింది.…