Friday, 13 November 2026

హైదరాబాద్

ముగిసిన వైఎస్‌ విజయమ్మ చేపట్టిన దీక్ష

హైదరాబాద్‌: భోధనా ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే పూర్తిగా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఇందిరాపార్కు వద్ద మైకాపా గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ చేపట్టిన రెండురోజుల దీక్ష ఈరోజు ముగిసింది. బోధన ఫీజుల పథకంతో కిరణ్‌ సర్కారు వ్యాపారం చేస్తోందని ఆమె…

ప్రభుత్వ ఏర్పాట్లపై వినాయక ఉత్సవ కమిటీ అసంతృప్తి

హైదరాబాద్‌: గణేశ్‌ నవరాత్రులకు ప్రభుత్వ ఏర్పాట్లపై భాగ్యనగర ఉత్సవ కమిటీ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. మండపాల అనుమతులకు పోలీసులు వేధించడంతో పాటు వినాయక విగ్రహాల నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేయటం లేదని వారు మండిపడ్డారు. నిమజ్జనం సమయంలో రవాణా…

నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరు

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ పరిధిలో నందనవనం రహదారికోసం ఇరవైఆరున్నర కోట్ల రూపాయల మంజూరుకు సర్కారు అనుమతులిచ్చింది. రహదారి వెడల్పునకు సంబంధించి అన్ని పనులను మహా నగర పాలక సంస్థ హైదరాబాద్‌ మహానగర అభివృధ్ది ప్రజెక్టు కింద చేపట్టాలని కోరారు.

బళ్లారి అక్రమ మైనింగ్‌ స్పందించిన ‘సుప్రీం’

న్యూఢిల్లీ: కర్ణాటకలోని  బళ్లారి అక్రమ మైనింగ్‌పై సుప్రీంకోర్టు స్పందించింది. అక్రమ మైనింగ్‌పై విచారణ చేయాలన్ని సీబీఐని కోర్టు ఆదేశించింది.ఆరు వారాల్లోగా దర్యాప్తు నివేదిక కోర్టుకు సమర్పించాలని పేర్కొంది. అక్రమ మైనింగ్‌కు సంబంధించిన నిందితులను కఠినంగా శిక్షంచాలని తెలిపింది. దర్యాప్తులో…

కావూరిని మాయమాటలు: ఆమోస్‌

హైదరాబాద్‌: ఎంపీ కావూరి సాంబశివరావు మాయమాటలు చెబుతున్నారని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ఆమోస్‌ అన్నారు. తెలంగాణ ప్రజలు తెలంగాణ తప్ప మరే ప్యాకేజీకి ఒప్పుకునేదిలేదని ఆయన తేల్చి చెప్పారు. డబ్బులున్న సీమాంధ్ర నేతల ఒత్తిడి వల్లే తెలంగాణ ఆలస్యమౌతుందని చెప్పారు.

సుమన్‌ అంత్యక్రియలు పూర్తి

హైదరాబాద్‌: ఈనాడు గ్రూప్స్‌ అధినేత రామోజిరావు రెండో కుమారుడుడైన సుమన్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. అశ్రునయనాల మధ్య ఆయన అభిమానులు సుమన్‌కు అంతిమ వీడ్కోలు పలికారు. రామోజీ ఫీల్మ్‌ సిటీలోని రామోజీ స్వగృహం నుంచి బయలు దేరిన శవయాత్ర ఫిల్స్‌సిటీలోనే…

పోరుదీక్షతో మా లక్ష్యం నెరవేరింది: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: తెలంగాణ సాధన కోసం ఢిల్లీలో చేసిన పోరుదీక్షతో తమ లక్ష్యాన్ని సాధించగలిగామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నేరుగా గన్‌పార్క్‌కు వచ్చిన ఆయన తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. తెలంగాణ…

కళారంగంలో ప్రత్యేకత నిలుపుకొన్నారు: చిరంజీవి

హైదరాబాద్‌: కళారంగంలో సుమన్‌ తనకంటూ ఓ ప్రత్యేకతను నిలపుకొన్నారని చిరంజీవి అన్నారు. చిన్నవయసులోనే సుమన్‌ కాలం చేయడం జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు. అనార్యోగంతో కన్నుమూసిన ప్రముఖ రచయిత, దర్శకుడు నటుడు సుమన్‌ భౌతిక కాయానికి ఆయన నివాళులర్పించారు. రామోజీరావు, కుటుంబసభ్యులకు…

ఉమ్మడి రాజధానికి ఒప్పుకునేదే లేదు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి ఢిల్లీలో తెలంగాణ పోరు దీక్షా కార్యక్రమాన్ని ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక్కడ గన్‌పార్క్‌ వద్ద అమరవీరుల స్థూపం వద్ద అమరులకు నివాళులర్పించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. కేంద్రం తెలంగాణ…

చైనాలో భూకంపం

బీజింగ్‌: చైనాలో భారీ భూకంపం సంభవించింది. భూకంపం తాకిడికి చైనాలోని పలు ప్రాంతాలు అతలాకుతలమయ్యాయి. ఈ ఘటనలో 20 మంది దుర్మరణం చెందారు. 20 వేల మందికి పైగా నిరాశ్రయలయ్యాయి. భూకంప తీవ్రత రిక్టర్‌స్కేల్‌ పై దీని తీవ్రత…