Friday, 13 November 2026

హైదరాబాద్

హైదరాబాద్‌లో కొనసాగుతున్న సీబీఐ సోదాలు

హైదరాబాద్‌: బొగ్గు కుంభకోణం కేసులో మన రాష్ట్రంలోనూ సీబీఐ సోదాలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్త సోదాల్లో భాగంగా హైదరాబాద్‌లోని పలు సంస్థలు, ప్రముఖులు సివాసాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పది పట్టణాల్లో 30 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ సోదాలు…

పారాలింపిక్స్‌లో భారత్‌కు పతకం

లండన్‌: పారాలింపిక్స్‌లో భారత్‌ తొలి పతకాన్ని సాథించింది. పురుషుల హైజంవ్‌లో కర్ణాటక క్రీడాకారుడు గిరీశ్‌ హోసనగర్‌ నాగరాజేగౌడ్‌ రజిత పతకం సాధంచాడు.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్‌స 60 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఆటు నిఫ్టీ కూడా 10 పాయింట్లకు పైగా  నష్టంతో కొనసాగుతోంది.

వేటకు వెళ్లి మత్య్సకారుడి మృతి

పోలాకీ: శ్రీకాకుళం జిల్లా పోలాకీ మండలంలోని గుప్పెడుపేట గ్రామానికి చెందిర అప్పయ్య (50) అనే మత్స్యకారుడు వేటకు వెళ్లి పడవ బోల్తా పడటంతో మృతి చెందాడు. మంగళవారం తెల్లవారుజామున గ్రామానికి చెందిన నలుగురు వేటకు వెళ్లారు. మిగతా ముగ్గురు …

ఆస్తి తగాదాల నేపథ్యంలో ఇద్దరి చిన్నారుల హత్య

రంగారెడ్డి: శంకర్‌పల్లి మండలం పుండకల్‌ గ్రామంలో దారుణం జరిగింది. ఆస్తి తగాదాలతో ఓ మహిళతోపాటు ఆమె ఇద్దరు పిల్లలకు బంధువులు విషంపెట్టారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు నందిని (3), జ్యోత్స్నీ (8నెలలు)లు మృతి చెందగా తల్లి ఉషారాణిని…

వరంగల్‌ జిల్లాలో ఉప్పొంగుతున్న వాగులు

వరంగల్‌: జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు పలు వాగులు ఉద్థృతంగా ప్రవహిస్తున్నారు. గణపూర్‌ గణసముద్రం వాగు, భూపాలపల్లి మొరంచా వాగుల్లో వరద ప్రవాహం ప్రమాదస్థాయికి చేరింది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి.

నేటి నుంచి కర్నూలు జిల్లాలో ముఖ్యమంత్రి ఇందిరమ్మబాట

కర్నూలు: సోమవారం జరగాల్సిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి జిల్లా పర్యటన వాతావరణం అనుకూలించకపోవడంతో వాయిదా పడింది. మంగళ, బుధవారం పర్యటన యధావిధిగా జరగనుంది. ఐదో తేదీన కర్నూలు నగరంలో కార్యక్రమాలన్ని ముగించుకుని సాయంత్రం నాలుగు గంటలకు నందికొట్కూరుకు బయలు…

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

హైదరాబాద్‌: హయత్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అగి ఉన్న లారీని వెనక నుంచి వ్యాను ఢీకొనడంతో ఒకరి అక్కడికక్కడే మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు.

వరంగల్‌లో భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌

వరంగల్‌: భారీ వర్షాల కారణంగా గుండ్రాతి మడుగు-గార్ల స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌ దెబ్బతింది. ఈ మార్గంలో 50 స్లీవర్ల మేరు కంకర కొట్టుకుపోయి రైల్వే ట్రాక్‌ గాల్లో వేలాడుతోంది. దీంతో విజయవాడ-కాజీపేట మార్గంలో పలు రైళ్లను దారి…

ఆర్టీసీ బస్సు- లారీ ఢీ, 15 మందికి గాయాలు

గుంటూరు: జిల్లాలోని మెదికొండూరు మండలం జంగన్‌ గుంట్లపాలెం వద్ద సోమవారం అర్థరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో 15 గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ ఎదురెదురుగా వచ్చి ఢికొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.…