Wednesday, 11 November 2026

హైదరాబాద్

డీఈవోపై ఉపాధ్యాయురాలు ఫిర్యాదు

కర్నూలు: జిల్లా విద్యాశాఖాధికారి మానసిక వేధింపులకు గురిచేస్తున్నారంటూ ఓ ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బదిలీ విషయంలో డీఈవో అమర్యాదగా ప్రవర్తించారని ఆమె మూడో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విద్యుత్‌ అధికారుల నిర్భంధం

నల్గొండ: అప్రకటిత విద్యుత్‌ కోతలకు  నిరసనగా జిల్లాలోని ఆత్మకూరు (ఎస్‌) మండలంలో రైతులు రోడ్డెక్కారు. గట్టికల్‌, పాతర్లపాడులో సబ్‌స్టేషన్లను ముట్టడించి విద్యుత్‌ అధికారులను నిర్భంధించారు. కోతల ఎత్తివేతపై అధికారులు వచ్చి హామీ ఇచ్చేంతవరకూ తమ ఆందోళన విరమించమని రైతులు…

విజయవాడలో ఘంటసాల సంగీత విభావరి

విజయవాడ: స్థానిక ఘంటసాల  వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో ఆదివారం ఉదయం ఘంటసాల సంగీత విభావరి ప్రారంభమైంది. రాష్ట్ర సాంస్తృతిక శాఖ, ఆంధ్రా ఆర్స్ట్‌ అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో 14 గంటలపాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 14 మందికిపైగా గాయనీగాయకులు…

సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం

గుంటూరు.: సీమాంధ్ర విద్యార్థుల ఐకాస సమావేశం ఈ నెల 23న నాగార్జున విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈభేటీలో రాష్ట్ర విభజన పరిణామాలపై సమాలోచనలు చేసి భవిష్యత్‌ కార్యాచరణపై విద్యార్థులు చర్చించనున్నారు.

గాంధీ ఆసుపత్రి భవనంపై నుంచి దూకి రోగి ఆత్మహత్య

హైదరాబాద్‌: గాంధీ ఆసుపత్రి నాల్గవ అంతస్థు నుంచి దూకి ఓ మానసిక రోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతున్ని జీడిమెట్లకు రవీందర్‌గా గుర్తించారు. ఇతను నాలుగురోజుల క్రితం మానసిక సమస్యలతో ఆసుపత్రిలో చేరాడు.

పటాన్‌చెరు పారిశ్రామికవాడకు విద్యుత్‌ సరఫరా నిలిపివేత

మెదక్‌: పటాన్‌చెరు నియోజకవర్గంలోని పారిశ్రమికవాడలకు విద్యుత్‌ సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చే వరకూ సరఫరా నిలిపివేస్తున్నట్లు ట్రాస్స్‌కో అధికారులు తెలియజేశారు. దీంతో పారిశ్రామికవర్గాలు ఆందోళనకుదిగాయి.

ఓయూ పరిధిలో పరీక్షలు వాయిదా

హైదరాబాద్‌: ఉస్మానియా విశ్వవిద్యాలయం  పరిధిలో ఈ నెల 21,22 తేదీల్లో జరిగే అన్ని పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రిజిస్టార్‌ తెలిపారు. అధ్యాపకులు సమ్మె కారణంగా పరీక్షలు వాయిదా వేసినట్లు చెప్పారు. పరీక్షలను తిరిగి ఎప్పుడు. నిర్వహించేంది. త్వరలోనే వెల్లడిస్తామని…

ఇసుక లారీల పట్టివేత

నల్గొండ: వేములపల్లిలో ఇసుక ఆక్రమ  రవాణాపై రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. మిర్యాలలగూడ ఆర్డీవో శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తనికీలు చేపట్టి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న 5 లారీలను స్వాధీనం చేసుకున్నారు. లారీలను పోలీసుస్టేషన్‌ తరలించనున్నట్లు అధికారులు…

రుయా ఆసుపత్రిని సందర్శించిన నారాయణ

తిరుపతి: శిశు మరణాలు చోటుచేసుకుంటున్న తిరుపతి రుయా ఆసుపత్రిని సీపీఐ రాస్త్ర కార్యదర్శి నారాయణ సందర్శించారు. అందుతున్న వైద్య సేవల గురించి అక్కడివారిని ఆడిగి తెలుసుకున్నారు. నారాయణ వెంట స్థానిక నేతలు తదితరులు ఉన్నారు.

డొంకరాయి జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం

రాజమండ్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో తూర్పుగోదావరి జిల్లాలోని డొంకరాయి జలాశయంలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తి 4400 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు.