Wednesday, 11 November 2026

హైదరాబాద్

అంతర్‌ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అనంతపురం: అనంతపురంలో  అంతర్‌రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 1.25 కోట్ల విలువైన 3.25 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు.

విద్యుత్‌ కోతల విషయంలో అధికారులను తప్పు పట్టదు:పీసీసీ చీఫ్‌

విజయనగరం: విద్యుత్‌ కోతల విషయంలో ట్రాన్స్‌కో అధికారులను తప్పుపట్టవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజలకు సూచించారు. విజయనగరం జిల్లా సమీక్షా సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. విద్యుత్‌ కోతల విషయంలో వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకొవాలని కోరారు. నిర్వహణా…

మంత్రి వర్గ ఉపసంఘం సమావేశం-ఫీజురీయింబర్స్‌మెంట్‌పై చర్చ

హైదరాబాద్‌: సచివాలయంలో కేబినెట్‌ సబ్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి మంత్రులు పితాని సత్యనారాయణ, బసవరాజు సారయ్య తదితరులు హాజరయ్యారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లపై ఈ సమావేశంలో  చర్చిస్తున్నట్లు సమాచారం తెలిసింది.

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 30, 380 గా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 29, 650గా ఉంది. కిలో వెండి…

మమతా బెనర్జీపై కోర్టులో పిటిషన్‌

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. మమత వాఖ్యల వీడియోను న్యాయనిపుణులు పరిశీలించారు. ఈ వ్యవహారంపై మమతా బెనర్జీపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలిసింది.

తెలంగాణ రాజకీయ ఐకాస భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ రాజకీయ ఐకాస నేతలు సీపీఐ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పాల్గొన్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఉద్యమ కార్యాచరణపై నేతలు చర్చిస్తున్నారు.

రజత పతక విజేత విజయ్‌కుమార్‌కు పదోన్నతి

న్యూఢిల్లీ: లండన్‌ ఒలింపిక్స్‌లో రజత పతక విజేత విజయ్‌కుమార్‌కు పదోన్నతికల్పిస్తూ సైన్యం గౌరవించింది. ఒలింపిక్స్‌లో భారత్‌ సత్తా చాటిన విజయ్‌కుమార్‌కు సుబేదార్‌ మేజర్‌గా పదోన్నతి కల్పిస్తూ సైన్యం ఉత్తర్వులు జారీ చేసింది.

దేశ్‌ముఖ్‌ మృతికి సంతాపంగా ఉభయసభలు రేపటికి వాయిదా

న్యూఢిల్లీ: అనారోగ్య కారణంగా మృతి చెందిన కేంద్ర మంత్రి, సీనియర్‌ కాంగ్రెస్‌  నేత విలాస్‌రావ్‌ దేశ్‌ముఖ్‌కు ఈ రోజు పార్లమెంట్‌ ఉభయసభల్లో ఘనంగా నివాళులు ఆర్పించారు. కాంగ్రెస్‌ పార్టీకి, దేశానికి ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఆయన లోటు…

డీజీపీ నియామకంపై ప్రభుత్వ పిటిషన్‌ కొట్టివేత

హైదరాబాద్‌: డీజీపీ నియామకం విషయంలో క్యాట్‌ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. డీజీపీ నియామకంపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును కోర్టు సమర్థించింది. వారం రోజుల్లోగా డీజీపీ నియామక కమిటీని…

అసోంలో మరోసారి చెలరేగిన అల్లర్లు

అసోం: అసోంలో పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉంది. ఎక్కడ ఎప్పుడేం జరుగుతోంది చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈరోజు బస్కా జిల్లా తముల్‌పూర్‌లో మరోసారి అల్లర్లు చెలరేగాయి. కొందరు గుర్తు తెలియని దుండుగులు ఓ బస్సుకు నిప్పు పెట్టారు.…