Wednesday, 11 November 2026

హైదరాబాద్

జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తున్నారు:దేవేందర్‌గౌడ్‌

మహబూబ్‌నగర్‌: జలయజ్ఞం పేరుతో రాష్ట్రాన్ని లూటీ చేస్తూన్నారని టీడీపీ నేత దేవేందర్‌గౌడ్‌ అన్నారు. జిల్లా టీడీపీ నేతలు రావులపాటి చంద్రశేఖర్‌రెడ్డి, రాములు, బక్కాని నర్శింహుల్‌, మధుసుధనరావులతో కలిసి కల్వకుర్తి ప్రాజెక్ట్‌ను పరిశీలించారు. ఈ సంధర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ…

పాల్వంచ కేటాపీఎస్‌-7లో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం

ఖమ్మం: జిల్లాలో పాల్వంచ కేటీపీఎస్‌ -7 యూనిట్‌లో సాంకేతికలోపంతో విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దీంతో 120 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది.

ఖైరతాబాద్‌- పంజాగుట్ట మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌: నిమ్స్‌ వద్ద ప్రధాన రహదారి పై నిన్న ఏర్పడిన భారీ గుంత వద్ద మరమ్మతు పనులు జరుగుతున్నాయి. దీంతో ఈ మార్గంలో ట్రిఫిక్‌ను దారి మళ్లించారు. ఖైరతాబాద్‌ నుంచి వచ్చే వాహనాలను సోమాజీగూడ రాజ్‌భవన్‌ మీదుగా, పంజాగుట్ట…

పరీక్షకేంద్రం పేరు తప్పుగా ముద్రించడంతో గ్రూప్‌4 పరీక్ష రాసే అవకాశం కోల్పోయిన 40మంది

హైదరాబాద్‌: బోడుప్పల్‌: గ్రూప్‌-4 అభ్యర్థులకు పరీక్ష కేంద్రం పేరును అధికారులు తప్పుగా ఇచ్చారు. ఉప్పల్‌ డిపో దగ్గర ఫిర్జాది గూడా లోని శ్రీ చైతన్య మహిళా కళాశాల చిరునామా ఇవ్వాల్సిన అధికారులు ఘట్‌కేసర్‌ శ్రీ చైతన్య జూనియర్‌ కళాశాల…

భారత సంతతికి చెందిన జర్నలిస్‌ సస్పెండ్‌ చేసిన టైమ్‌ పత్రిక

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన జర్నలిస్ట్‌ను టైమ్‌ పత్రిక సస్పెండ్‌ చేసింది. టైమ్‌ పత్రిక కాలమిస్ట్‌గా పనిచేస్తూ టైమ్‌ మేగజైన్‌లో ఆయన రాసిన ‘ద కేన్‌ గన్‌ కంట్రోల్‌’ అనే వ్యాసంలో న్యూయర్క్‌ర్‌ పత్రికలో మరో రచయిత రాసిన…

గ్రూపు-4 పరీక్షకు 75.53 శాతం హాజరు

హైదరాబాద్‌: ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైన గ్రూపు-4 రాత పరీక్షకు 75.53 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారని ఏపీపీఎస్సీ తెలిపింది. 9,56759 అభ్యర్థులు ధరఖాస్తు చేసుకున్నారని పేర్కొంది. 6,68,751 అభ్యర్థులు పరీక్షకు హాజరైనారని ఏపీపీఎస్సీ వివరించింది.

ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారుగా రాజన్‌

ఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారుగా రాఘురాం జి. రాజన్‌ నియమితులయ్యారు ఆయన గతంలో ఐఎంఎఫ్‌లో ప్రధాన ఆర్థికవేత్తగా పనిచేశారు. కేబినెట్‌ అప్పాయింట్‌మెంట్స్‌ కమిటీ రఘురాం రాజన్‌ నియామకాన్ని ఈ రోజు ఖరారు చేసింది.

ఆలయ వివాదంపై సీఎం సమగ్ర విచారణ జరిపిస్తానన్నారు: దానం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని లక్ష్మీనరసింహ స్వామి ఆయల వివాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. తన విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని, హరేకృష్ణకు కేటాయించి భూములను రద్దు చేయాలని కోరానని…

సీఎం కిరణ్‌పై మండిపడ్డ పాల్వాయి గోవర్థన్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం జరిగితే తెలంగాణకు 45 టీఎంసీల నీళ్లు అంటున్నారు కానీ, తెలంగాణకు 600 టీఎంసీల నీళ్లు దక్కాలని తెలియజేశారు. 45 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి…

చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంతో గవర్నర్‌ నరసింహన్‌తో  భేటీ అయ్యారు. రాష్ట్ర పరిస్థితులపై చర్చిస్తున్నట్లు సమాచారం. సాయంత్రం సోనియా, ఆజాద్‌లతో గవర్నర్‌ భేటీ కానున్నారు.