Tuesday, 10 November 2026

హైదరాబాద్

వుడా భూ కుంభకోణంలో ప్రాథమిక విచారణ: సీబీఐ జేడి

విశాఖపట్టణం: వుడా భూ కుంభకోణం కేసులో ప్రాథమిక విచారణ జరుగుతోందని సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ సీబీఐ కోర్టులో మౌళిక సదుపాయాలు, కేసులను సమీక్షించేందుకు ఇక్కడకు వచ్చానన్నారు.

విజయనగరం జిల్లాలో విజిలెన్స్‌ దాడులు

విజయనగరం: గరుగుబిల్లి మండలంలో విజిలెన్స్‌ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ఈదాడుల్లో రూ.20లక్షల విలువైన 200బస్తాల నువ్వులు స్వాధీనం చేసుకున్నారు. 160జీడిపిక్కల బస్తాలు, 258ఎరువుల బస్తాలు కూడా స్వాధీనం చేసుకున్నారు.

బలంగా మారిన నైరుతి రుతుపవనాలు

విశాఖపట్నం: నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో బలంగా మారాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 45నుంచి 50కిలో మీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని పేర్కొంది. సముందంలోకి వెళ్లే మత్స్య కారులు అప్రమత్తంగా…

మరో ముగ్గురు అమర్‌నాథ్‌ యాత్రికుల మృతి

శ్రీనగర్‌: అమర్‌నాథ్‌ యాత్రలో మరో ముగ్గురు యాత్రికులు మరణించినట్లు అధికారులు గురువారం వెల్లడించారు. వీరిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యాత్రికుడొకరున్నట్లు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు మృతి చెందిన అమర్‌నాథ్‌ యాత్రికుల సంఖ్య 88కి చేరుకుందన్నారు. మధ్యప్రదేశ్‌కు చెందిన నవీన్‌…

కోలుకుంటున్న శతృఘ్నసిన్హా

ముంబాయి: ఇటీవలే బైపాస్‌ శస్త్రచికిత్స చేయించుకున్న నాటితరం బాలీవుడ్‌ నటుడు శతృఘ్న సిన్హాను గురువారం నాడు ఐసీయూ నుంచి గదికి తరలించారు. గురువారం ఉదయం ఆయనను గదికి తరలించారనీ, వైద్యుల సూచనల మేరకు మరికొద్ది రోజుల పాటు ఆయన…

బల్గేరియా ఎయిర్‌పోర్టులో బస్సు పేల్చివేత

బర్గాన్‌, బల్గేరియా: బల్గేరియాలో ఇజ్రాయెల్‌కు చెందిన పర్యాటకులతో గల ఓ బస్సును ఆత్మాహుతిదళ సభ్యుడొకరు పేల్చివేశాడు. ఈ ఘటనలో ఉగ్రవాది, బసు& డ్రైవర్‌ సహా మొత్తం ఏడుగురు వ్యక్తులు మరణించారు. దాడి బుధవారం రాత్రి బర్గాన్‌ విమానాశ్రయంలో జరిగింది.…

రేపటి నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు పట్టణాల్లో శుక్రవారం నుంచి ఎంబీబీఎస్‌ కౌన్సిలింగ్‌ జరుగనుంది. ఉదయం 10గంటలకు హైదరాబాద్‌, తిరుపతి, విజయవాడ, విశాఖపట్టణాల్లో కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది.

గుర్తు తెలియని వాహనం ఢీ: ఇద్దరు మృతి

కరీంనగర్‌: కరీంనగర్‌-ధర్మారం రహదారిపై పత్తిపాక వద్ద ఇవాళ రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

మహిళ శిశుసంక్షేమపథకాలకు ప్రచారం

హైదరాబాద్‌: రాష్ట్రంలో మహిళా శిశుసంక్షేమ పథకాలకు విస్తృతంగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తామని రాష్ట్ర మహిళాశిశు సంక్షేమమంత్రి సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. తమ శాఖ చేబట్టే కార్యక్రమాల ప్రచారం కోసం ఆమె ఒక గోడపత్రికను విడుదల చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో…

డా.రెడ్డీన్‌ మొదటి త్రైమాసిక ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: ఔషదరంగ సంస్థ డాక్టర్‌ రెడ్డీన్‌ 2012-13ఆర్థిక సంవత్సర మొదటి త్రైమాసిక ఫలితాలను విడుదలచేసింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో ఆశాజనక ఫలితాలు సాధించినట్టు కంపెనీ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే 28శాతం వృద్ధి సాధించినట్టు కంపెనీ ఒక ప్రకటనలో…