Thursday, 5 November 2026

హైదరాబాద్

రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మాకు బీజేపీ మద్దతు

ఢిల్లీ: రాష్ట్రపతి అభ్యర్థిగా సంగ్మకు మద్దతు ఇస్తున్నట్లు ఈ రోజు సమావేశ అనంతరం బీజేపీ సీనియర్‌ నాయకురాలు సుష్మస్వరాజ్‌ తెలిపారు. ఎన్డీయేలో రాష్ట్రపతి అభ్యర్థి అభ్యర్థిపై ఏకభిప్రాయం లేదని ఆమె అన్నారు. ప్రణబ్‌ అభ్యర్థిత్వంపై మాతో ప్రభుత్వం సంప్రదింపులు…

భాను, కృష్ణలపై మరో కేసు

హైదరాబాద్‌:  సూరి హత్య కేసులో నిందితుడు భాను, దంతులూరి కృష్ణలపై సీఐడీ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌ జిల్లా తలకొండపల్లిలో ప్రవాసభారతీయురాలు సునీతకు ఉన్న 25 ఎకరాల భూమి కబ్జా చేశారని సీఐడీ వారి మీద…

నార్కో పరిక్షలపై విచారణ వాయిద

హైదరాబాద్‌: వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి, విజయసాయిరెడ్డిలకు నార్కో పరీక్షలు నిర్వహించడంపై విచారణను వచ్చే నెల 4వ తేదికి కోర్టు వాయిద వేసింది.

ఇంటర్‌ సప్లిమెంటరి ప్రథమసంవత్సర పరిక్ష ఫలితాలు విడుదల

>· హైదరాబాద్‌: ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరిక్ష ఫలితాలను ఇంటర్‌ బోర్డ్‌ ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు విడుదల చేసింది. ఉత్తీర్ణత శాతం 8.14

62 ప్రైవేటు బస్సులు స్వాధీనం

75 కేసులు నమోదు హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తగా ప్రైవేటు బస్సులు, పాఠశాలల బస్సులపై రవాణాశాఖ తనిఖీలు నాలుగోరోజూ కొనసాగుతున్నాయి. రహదారులపై తనిఖీలు చేపట్టారు. ప్రత్యేక బృందాలుగా ఏర్పడ్డ అదికారులు వేకువజామునుంచే హైవేలు, చేక్‌పోస్టులు, రహదారులపై తనిఖీలు చేపట్టారు. ఒంగోలు, గూంటూరు,…

హైదరాబాద్‌ చేరుకున్న సీబీఐ

హైదరాబాద్‌:  సీబీఐ అదనపు డైరెక్టర్‌ గుప్తా ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. జగన్‌ అక్రమాస్తులు, ఓబుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసు, ఎమ్మార్‌ అక్రమాల కేసుల పురోగతిని సమీక్షించేందుకు ఆయన హైదరాబాద్‌ వచ్చినట్లు  తాజా సమాచారం అందింది.

తెలుగెదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు భేటీ

హైదరాబాద్‌: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ఈ రోజు నరసన్నపేట నియోజవర్గ నేతలతో భేటీ అయ్యారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో సాగుతున్న ఈ సమావేశంలో ఉప ఎన్నికల ఫలితాలపై చర్చిస్తున్నారు.

భారత్‌-చైనా ఒప్పందం

బ్రెజిల్‌: రక్షణరంగంలో 2015లోగ 100 బిలియన్‌ డాలర్ల పెట్టుబడి పెట్టేలా భారత్‌-చైనా ఒప్పందం కుదుర్చుకున్నాయి. బ్రెజిల్‌లో జరుగుతున్న రియో డిజెనెరీ సదస్సులో  ఇరు దేశాల ప్రధానమంత్రులు ఒప్పందంపై సంతకాలు చేశారు.

కేటీపీఎస్‌లో ప్రమాదం

ఖమ్మం: పాల్వంచ కేటీపీఎస్‌లో ప్రమాదం కేటీపీఎస్‌ పాతకర్మాగారంలోని  ‘ఎ’ స్టేషన్లో ఈ రోజు జరిగిన ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. విధి నిర్వహణలో ఉన్న కార్మికులపై బొగ్గు పెళ్లలు విరిగిపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో గాయపడ్డ…

టెలిఫోన్‌ ఎక్ఛేంజిలో అగ్నిప్రమాదం

నిజామాబాద్‌: దర్పల్లిలోని టెలిఫోన్‌ ఎక్జేంజ్‌ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కార్యాలయంలోని ఫర్నిచర్‌తో పాటు, సాంకేతిక పరికరాలు కూడా కాలిపోయ్యాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.