Thursday, 5 November 2026

హైదరాబాద్

నిందితుల విచారణకు ఈడీకి అనుమతి

హైదరాబాద్‌: ఎమ్మార్‌, ఓఎంసీ, జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో జైలులో ఉన్న నిందితుల విచారణకు ఈడీకి న్యాయస్థానం అనుమతినిచ్చింది.నిందితులను 15 రోసుల్లోగా విచారించాలని న్యాయస్థానం ఈడీని ఆదేశించింది. ఓఎంసీ కేసులో శ్రీనివాస్‌రెడ్డి, శ్రీలక్ష్మి, రాజగోపాల్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించనున్నారు. అక్రమాస్తుల…

గిలానీపై అనర్హత వేటు వేసిన పాక్‌ సుప్రీంకోర్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ ప్రధానమంత్రి యూసఫ్‌ రజా గిలానీపై ఆదేశ అత్యున్నత న్యాయస్థానం అనర్హత వేటువేసింది. ఈకేసును విచారించిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం గిలానీని వెంటనే తొలగించాలని అధ్యక్షుడు జర్దారీని ఆదేశించింది. గిలానీ స్థానంలో నూతన నియామకం చేపట్టేందుకు వెంటనే…

మద్యం సిండికేట్ల కేసులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే

కర్నూలు: ఏసీబీ ముందు విచారణకు హాజరైన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే  చెన్నకేశవరెడ్డి  మద్యం సిండికేట్ల కేసులో విచారణకు హాజరయ్యారు.రాయలసీమ ప్రాంత ఏసీబీ జేడీ శివశంకర్‌రెడ్డి ఎమ్యెల్యే చెన్నకేశవరెడ్డిని ప్రశ్నిస్తున్నారు.

ఉమేశ్‌కుమార్‌ సస్పెన్షన్‌

హైదరాబాద్‌: సీనియర్‌ ఐసీఎస్‌ అధికారి ఉమేశ్‌కుమార్‌ని సస్పెండ్‌ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. మూడు రోజులు అందుబాటులో లేనందున క్రమశిక్షణ చర్యకింద ఉమేశ్‌కుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది.

రూ. 2 కోట్లకు పెంచేందుకు సీఎం అంగీకారం

హైదరాబాద్‌: రూ. కోటిగా ఉన్న పాత్రికేయ మూలనిధిని రూ. 2 కోట్లకు  పెంచేందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి  అంగీకరించారు. ఈరోజు ఆయన సమాచార పౌరసంబంధాల శాఖపై సమీక్ష జరిపారు. త్వరితగతిన నిధులు విడుదల చేయాల్సిందిగా ఆర్థిక శాఖకు ఆయన ఆదేశాలు…

ప్రణబ్‌కు ఓటు వేయ్యాద్దు

అన్ని ఓయులో టీ కాంగ్రెస్‌ నేతలు హైదరాబాద్‌ : తెలంగాణ టీ- కాంగ్రెస్‌ నేతలపై తెలంగాణ ఓమూ విద్యార్థులు మరోసారి నిప్పులు చెరిగారు. ఈ రోజు ఉస్మానియా యునివర్సిటీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విద్యార్ధులు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు,ఎమ్మెల్యేల…

24 గంటల్లో నమోదైనవర్షపాతం

హైదరాబాద్‌: తెలంగాణలోని పలు ప్రాంతాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. గత ఇరవై నాలుగు గంటలుగా పలు చోట్ల వర్సాలు కురుస్తూనే ఉన్నాయి.వివిధ ప్రాంతాల్లో నమోదైన వర్షాపాతాన్ని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్‌,మెదక్‌, నిజామాబాద్‌, ఖమ్మంలలో 3సెంటీమీటర్లు,మహబూబ్‌నగర్‌, భద్రాచలం, అశ్వారావుపేట,…

జీ 20 ఎజెండా సవరించాలి: ప్రధాని మన్మోహన్‌సింగ్‌

మెక్సికో: ఐరోపా ఆర్థిక స్థీరీకరణపై మెక్సికో వేదికగా జరుగుతున్న జీ 20 దేశాల సదస్సులో అంతర్జాతీయంగా ఆర్థికాభివృద్ధి మందబమనంపై భారత ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. జీ 20 దేశాల ముందు ఉన్న  ఎజెండా మోయలేని భారంతో…

మద్యాన్ని ప్రభుత్వానికి ఆదాయవనరుగా చూడరాదు

హైదరాబాద్‌: రాష్ట్రంలో మద్యం పేరుతో పేదవాళ్ల రక్తం తాగుతున్నారుని తెదేపా అధినేత చంద్రబాబు చెప్పారు.రాష్ట్రన్ని మధ్యప్రదేశ్‌గా మార్చాలని ప్రభుత్వం భావిస్తోందని ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన మద్యన్ని ప్రభుత్వానికి ఆదాయ వనరుగా చూడరాదన్నారు. మద్యం సిండికేట్లలో మంత్రుల…

బోనాల పండుగ ఏర్పాట్లపై మంత్రుల సమీక్ష

హైదరాబాద్‌: బోనాల పండుగ సమీపిస్తున్నా నేపథ్యంలో  మంత్రులు పండుగ  ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.అసెంబ్లీ ఆవరణలోని జూబిలీ హాల్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు గీతారెడ్డి, ముఖేశ్‌ గౌడ్‌, రామచంద్రయ్య, ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్‌ హాజరయ్యారు.