Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఖాళీల భర్తీ – దత్తాత్రేయ..

విశాఖపట్టణం : ఈఎస్ఐ ఆసుపత్రుల్లో ఖాళీలను భర్తీ చేస్తామని కేంద్ర మంత్రి దత్తాత్రేయ పేర్కొన్నారు. విశాఖపట్టణంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆదివారం ఉదయం దత్తాత్రేయ పరిశీలించారు.

గంజాయి రవాణాలో ముగ్గురి అరెస్టు..

విశాఖపట్టణం : కొత్తకోట ఏజెన్సీలో మూడు నాటు తుపాకీలతో గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వీరివద్ద 28 రౌండ్ల బుల్లెట్లు, 200 కిలోల గంజాయి, కారు స్వాధీనం చేసుకున్నారు.

నేడే శివాజీ దీక్ష..

గుంటూరు : నేడు కలెక్టరేట్ ఎదుట సినీ నటుడు శివాజీ నిరహార దీక్ష చేయనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేయనున్నారు.

ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదు – బొత్స..

గుంటూరు : ప్రత్యేక హోదా అవసరం లేదనడం సరికాదని కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలన మానేసి దేశాలు తిరుగుతూ ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు.

కడపలో కాసేపట్లో డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక.. 

కడప : కాసేపట్లో డీసీసీబీ ఛైర్మన్ ఎన్నిక జరగనుంది. డీసీసీ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా 144 సెక్షన్ విధించారు. డీసీసీబీ ఎన్నికకు వైసీపీ డైరెక్టర్లు గైర్హాజర్ అయ్యారు.