తూ.గో జిల్లాలో చంద్రబాబు పర్యటన..
తూ.గో : ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ, రాజమండ్రిలో బాబు పర్యటించనున్నారు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజమండిలో జరిగే మేడే వేడుకల్లో బాబు పాల్గొంటారు.
తూ.గో : ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించనున్నారు. కాకినాడ, రాజమండ్రిలో బాబు పర్యటించనున్నారు. కాకినాడ ఎన్టీఆర్ బీచ్ కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం రాజమండిలో జరిగే మేడే వేడుకల్లో బాబు పాల్గొంటారు.
కడప : జిల్లా సహకార బ్యాంకు అధ్యక్షుడి వ్యవహారంపై వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
అనంతపురం: వైసిపి నేత ప్రసాద్ రెడ్డి హత్యకేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు శ్రీనివాస్, అనిల్, అశోక్, రంగనాయకులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
చిత్తూరు: నేడు టీటీడీ పాలకమండలి బాధ్యతలు స్వీకరించనుంది. ఉదయం 8.30 గంటలకు బాధ్యతలను స్వీకరించనున్నారు.
తిరుపతి : శేషాచలం ఎన్ కౌంటర్ పై ప్రత్యేక దర్యాప్తు బృందం తిరుపతికి చేరుకుంది. పద్మావతి అతిథి గృహంలో పోలీసు, అటవీ అధికారులతో భేటీ అయ్యారు.
అనంతపురం : రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో మండలం కన్వీనర్ ప్రసాద్ రెడ్డిని దుండగులు హత్య చేశారు.
విజయవాడ : తెలుగు రాష్ట్రాల్లోని పలు వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న పీజీ మెడికల్ సీట్ల ప్రవేశానికి తొలి విడత కౌన్సెలింగ్ విజయవాడలో ఈ రోజు ప్రారంభమైంది.
పశ్చిమగోదావరి : జిల్లాలో కొయ్యలగూడెం మండలం బోడిగూడెంలో పొలం విషయంలో బంధువుల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈఘటనలో నలుగురికి గాయాలయ్యాయి.
అనంతపురం : గాయత్రి పాల డెయిరీలో మంత్రి సునీత అకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కల్తీ పాలు తయారవుతున్న నేపథ్యంలో మంత్రి ఈ తనిఖీలు నిర్వహించారు.
గుంటూరు : జిల్లాలోని మాచర్ల చెక్ పోస్టు వద్ద వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు.