Wednesday, 25 November 2026

సీమాంధ్ర

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

గుంటూరు : గుప్తనిధుల కోసం జరిగిన హత్యగా గుంటూరు జిల్లాలో సంచలనం రేపిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ప్రియుడితో కలిసి భార్యే భర్తను హతమార్చిందని తేల్చిన పోలీసులు మంగళవారం వాళ్లను అరెస్టు చేశారు. ఈ ఘటన గుంటూరు…

భార్యతో గొడవల కారణంగా భర్త ఆత్మహత్య

చిత్తూరు : పెళ్లి అయినప్పటి నుంచి భార్యతో ప్రతి రోజూ గొడవలే జరుగుతుండటంతో మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి తనువు చాలించాడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం కోలవారికండ్రిగ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. …

కడప డీసీసీబీ ఛైర్మన్ పై హైకోర్టులో విచారణ..

కడప : జిల్లా డీసీసీబీ ఛైర్మన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎలాంటి నోటీసులు లేకుండానే ఇద్దరు డైరెక్టర్ లను తొలగించారని వైసీపీ నేతలు హైకోర్టుకు తెలిపారు.

రాజధాని ప్రాంత రైతుల సమావేశం..

గుంటూరు : రాయపూడిలో రాజధాని ప్రాంత రైతులు సమావేశం ఏర్పాటు చేశారు. సీఆర్డీఏ నుండి కౌలు చెక్కులు తీసుకొనే అంశంపై చర్చ జరిగింది.

బుధవారం విశాఖలో సీఎం బాబు పర్యటన..

విశాఖపట్టణం : ఏపీ సీఎం చంద్రబాబు బుధవారం విశాఖలో పర్యటించనున్నారు. ఇండస్ట్రీయల్ పాలసీ మిషన్ ను బాబు ప్రారంభించనున్నారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో తృటిలో తప్పిన ప్రమాదం

పశ్చిమగోదావరి: జిల్లాలో తృటిలో ఘోర ప్రమాదం తప్పింది. ఓ స్కూల్‌ బస్సుపై విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. బస్సు ఆపి విద్యార్థుల్ని దించడంతో ముప్పు తప్పింది. ఆచంట మండలం కొండమంచిలి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ విషయం తెల్సుకున్న…

ఎర్రచందనం స్మగ్లర్ సోము రవి అరెస్టు

తిరుపతి: ఎర్రచందనం స్మగ్లర్ సోము రవిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళాడుకు చెందిన సోము రవిపై 23 ఎర్రచందనం కేసలున్నాయి. రవిపై పీడీ యాక్టు కింద కేసు నమోదు చేశారు.