బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చిన ఓటరు
చిత్తూరు: జిల్లాలోని బి.ఎన్ కండ్రిగ మండలం కంచనపుత్తూరులో రంగయ్య అనే ఓటరు ఓట్లు వేసేందుకు వెళ్లి బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు.
చిత్తూరు: జిల్లాలోని బి.ఎన్ కండ్రిగ మండలం కంచనపుత్తూరులో రంగయ్య అనే ఓటరు ఓట్లు వేసేందుకు వెళ్లి బ్యాలెట్ పత్రాలను బయటకు తెచ్చాడు. అప్రమత్తమైన పోలీసులు రంగయ్యను అదుపులోకి తీసుకున్నారు.
పర్చూరు (ప్రకాశం):గత పదేళ్లుగా రహదార్లను అభివృద్ధి చేయలేదని ఆగ్రహించిన పర్చురు గ్రామంలోని లక్ష్మీపురం కాలనీ వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. కాలనీలోని సుమారు 180 మంది ఓటర్లు ఓటు వేయకుండా నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం…
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలంలోని చిలువూరు గ్రామంలో పోటీ చేస్తున్న అభ్యర్థులు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు పోలింగ్‌ను అడ్డుకున్నారు. ఉదయం 7:40 గంటల వరకు పోలింగ్ ఏజెంట్లను కూడా లోపలికి వెళ్లకుండా ఓటర్లు అడ్డుకున్నారు. స్థానిక నాయకులు…
కడప: వీఎన్‌పల్లి మండలం గడ్డవారిపల్లె పోలింగ్ బూత్ వద్ద కాంగ్రెస్, వైకాపా కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. జిల్లాలోని నాగిరెడ్డిపల్లి పోలింగ్ కేంద్రంలో కూడా కాంగ్రెస్ ,వైకాపా వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని…
కడప,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్ జిల్లా అంబకల్లె గ్రామంలో ఎస్‌ఐతో గ్రామస్తుల ఘర్షణ వ్యవహారంలో స్థానిక నాయకుడు మురళి సహా నలుగురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అక్రమంగా అదుపులోకి తీసుకున్న వీరిని ఎక్కడా అరెస్టు చూపించలేదు.…
తిరుపతి: ఎస్వీయూలో పలు విభాగాలను విలీనం చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎస్వీయూ పరిపాలనా భవనం ఎదుట ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేయడంతో ఇక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు విశ్వవిద్యాలయానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువస్తున్నారు.
ఐ. పోలవరం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరికి వరద ఉద్ధృతి పెరుగుతోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాలను వరద అతలాకుతలం చేస్తోంది. పెరుగుతున్న నీటి ప్రవాహంతో లంక గ్రామాల వాసుల బిక్కు బిక్కుమంటూ గడుపుతున్నారు. తూర్పుగోదావరి…
విశాఖ,(జనంసాక్షి): వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు విశాఖలలోని తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. దీని కారణంగా రాష్ట్రంలో బలమైన గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
కాకినాడ,(జనంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా కాకినాడలోని డెయిరీ ఫారం కూడలిలీ తల్లీకొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కొడుక్కి విషం ఇచ్చి ఓ తల్లి తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందినట్లు సమాచారం.
విజయవాడ,(జనంసాక్షి): సోమవారం నుంచి ఈనెల 29 వరకు ఎంబీబీఎస్, బీడీఎన్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వీసీ ఐవీ రావు ఆదివారం తెలిపారు. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి కేంద్రాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.