పర్చూరు (ప్రకాశం):గత పదేళ్లుగా రహదార్లను అభివృద్ధి చేయలేదని ఆగ్రహించిన పర్చురు గ్రామంలోని లక్ష్మీపురం కాలనీ వాసులు పోలింగ్‌ను బహిష్కరించారు. కాలనీలోని సుమారు 180 మంది ఓటర్లు ఓటు వేయకుండా నిరసన తెలిపారు. ప్రజా ప్రతినిధుల తీరుపట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పట్టించుకోని నాయకులకు ఓట్లు ఎందుకు వేయాలని వారు ప్రశ్నిస్తున్నారు.




