కడప,(జనంసాక్షి): పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్‌ఆర్ జిల్లా అంబకల్లె గ్రామంలో ఎస్‌ఐతో గ్రామస్తుల ఘర్షణ వ్యవహారంలో స్థానిక నాయకుడు మురళి సహా నలుగురికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అక్రమంగా అదుపులోకి తీసుకున్న వీరిని ఎక్కడా అరెస్టు చూపించలేదు. దీంతో బాధితుల బంధువులు కోర్టును ఆశ్రయించారు. వెంటనే వారిని కోర్టులో ప్రవేశపెట్టాలని హైకోర్టు ఆదేశించింది.




