Monday, 23 November 2026

సీమాంధ్ర

శ్రీరామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు

అనంతపురం : అనంతపురం జిల్లా కోర్టు పరిటాల శ్రీరామ్‌కు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. శ్రీరామ్‌తోపాటు మరో ఐదుగురికి ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. రూ. 25 వేల సొంత పూచీకత్తును కోర్టుకు సమర్పించాలని జిల్లా కోర్టు వారిని…

ఏయూ విద్యార్థినిపై కత్తితో దాడి

విశాఖ : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవతున్నా అకృత్యాలు మాత్రం ఆగడం లేదు. విశాఖ జిల్లా గోపాలపట్నంలో విద్యార్థినిపై ఓ ఆగంతకుడు కత్తితో దాడికి పాల్పడ్డారు.    స్థానిక పెట్రోల్‌ బంక్‌ వద్ద ఆటో ఎక్కుతున్న …

రైల్వే పోలీసుపై యాసిడ్‌ దాడి చేసిన భార్య

కర్నూలు: ఓ రైల్వే పోలీసుపై అతని భార్య యాసిడ్‌ దాడి చేసిన ఘటన కర్నూలు జిల్లా నంద్యాలలో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుగా పనిచేస్తున్న వీరారెడ్డి అనే వ్యక్తి స్థానిక ఎన్జీవో కాలనీలో ఉంటున్నాడు. నిన్న రాత్రి అతను నిద్రిస్తుండగా…

కళాశాల బస్సు బోల్తా .. విద్యార్థులకు తీవ్రగాయాలు

విశాఖ : అచ్చుతాపురం మండలం కొండకార్లా జంక్షన్‌ సమీపంలో ఈ ఉదయం ఓ కళాశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మంది విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్తున్న నేషనల్‌ జూనియర్‌ కళాశాల బస్సు…

నత్తెనపల్లిలో రైతుల ఆందోళన

గుంటూరు : సాగునీటిని విడుదల చేయాలంటూ గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. రైతుల ఆందోళనతో సత్తెనపల్లి- గుంటూరు రహదారిపై 4 గంటలుగా వాహనాల రాకపోకాలు స్తంభించాయి.

పరిటాల శ్రీరామ్‌ బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

అనంతపురం : పరిటాల రవి తనయుడు శ్రీరామ్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై జిల్లా కోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాంగ్రెస్‌ నేత హత్యకు కుట్ర పన్నారని శ్రీరామ్‌తోపాటు మరికొందరిపై ధర్మవరం పోలీసులు కేసు…

హైదరాబాద్‌కు బయలుదేరిన ముఖ్యమంత్రి

ఘనంగా వీడ్కోలు పలికిన పార్టీ నాయకులు కోరుకొండ : రాజమండ్రి విమానాశ్రయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన గోల్లప్రోలు నుంచి హెెలికాప్టర్‌ ద్వారా రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకుని…

హెటిరో యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

విశాఖపట్నం : నక్కపల్లి హెటిరో ఔషధ కార్మాగారం ప్రమాద ఘటనకు సంబంధించి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వామపక్ష నేతలు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా ఆదివారం హెటిరో పరిశ్రమ వద్ద నిర్వహించిన ధర్నాలో వామపక్ష పార్టీ నేతలతో పాటు…

పోరాటాలకు అన్ని పార్టీలు మద్దతివ్వాలి : రాఘవులు

కృష్ణా: విద్యుత్తు ఛార్జీలకు సంబంధించి సీఎం చెప్పే వివరణలు సరికావని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు అన్నారు. విద్యుత్తు ఛార్జీలు సామాన్య, మధ్య తరగతి ప్రజలకు పెనుభారంగా మారాయన్నారు. ఛార్జీల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యమంత్రికి ప్రజలు…

కాల్పుల విరమణను ఉల్లంఘించిన పాక్‌

శ్రీనగర్‌: కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్‌ ఉల్లంఘించింది. నియంత్రణ రేఖ సమీపంలో యూరీ సెక్టార్‌పై సాక్‌ సైనికులు శతఘ్నులతో దాడులకు పాల్పడినట్లు ఆర్మీ ప్రతినిధి వెల్లడించారు. కొన్ని బాంబులు జనావాసాలకు సమీపంలో పడ్డట్లు చెప్పారు. అయితే ఈ ఘటనలో…