Monday, 23 November 2026

సీమాంధ్ర

రూ.10 లక్షల ఎర్ర చందనం పట్టివేత

రాజంపేట : కడప జిల్లా రాజంపేట శివారులో మినీ వ్యాన్‌లో తరలిస్తున్నా ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 10 లక్షలు ఉంటుందని చెప్పారు. వాహనం స్వాధీనం చేసుకొని స్మగ్లర్లను అదుపులోకి తీసుకున్నట్లు తెలియజేశారు.

నెల్లూరులో మంత్రులను అడ్డుకున్న తెదేపా నేతలు

నెల్లూరు: విద్యుత్‌ సర్‌ఛార్జీల పెంపునకు నిరసనగా నెల్లూరులో తెదేపా ఆందోళనకు దిగింది, నగరంలో పలు కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన మంత్రులు ఆనం పితానిలను పినాకిని అతిథిగృహం వద్ద తెదేపా  కార్యకర్తలు అడ్గుకున్నారు. సర్‌ఛార్జీలు వెంటనే ఉపసంహరించాలని డిమాండ్‌ వ్యక్తం…

విశాఖలో అగ్ని ప్రమాదం :11 ఇళ్లు దగ్థం

వేపగంట ( విశాఖపట్నం): జీవీఎంసీ 69వ వార్డు జడ్పీ ఉన్నత పాఠశాల పక్కన ఉన్న ఎస్సీ కాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 11 ఇళ్లు అగ్నికి అహుతయ్యాయి. ఈ  ఇళ్లల్లో ఇంటి వెనుక నుంచి ఆకస్మాత్తుగా మంటలు ఎగిసిపడ్డాయి.…

2014లో హంగ్‌ తప్పదు : సీపీఐ నారాయణ

నెల్లూరు : గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014లో కేంద్రంలో హంగ్‌ అసెంబ్లీ తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. కాంగ్రెస్‌ పార్టీ…

నాటు తుపాకీతో కాల్చుకుని ఇద్దరి మృతి

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకి కాల్చుకుని ఇద్దరు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన రవి, శివమ్మలు మృతిచెందారు. తమ అక్రమ సంబంధం భర్తకు…

అస్వస్థతకు గురైన హాస్టల్‌ విద్యార్థులు

కాకినాడ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శ్రీ చైతన్య కళాశాల వసతి గృహంలోని కొందరు విద్యార్థులు గురువారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరు బుధవారం రాత్రి మాంసాహారం భుజించారని, అందువల్లే అస్వస్థతకు గురైనట్లు తోటి విద్యార్థులు తెలిపారు.…

బోర్డు తిప్పేసిన ఐరావత్‌ ఫైనాన్స్‌

విశాఖపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో ఐరావత్‌ ఫైనాన్స్‌ అనే సంస్థ బోర్డు తిప్పేసింది. దాంతో 150 మంది బాధితులు ఆందోళన చేపట్టారు. సుమారు రూ. 15 కోట్లకు పైగా డబ్బు ఈ ఫైనాన్స్‌ సంస్థ ఎగవేసినట్లు భావిస్తున్నారు.

అన్ని పార్టీల వైఖరి స్పష్టం చేయాలి : కొండ్రు

శ్రీకాకుళం : తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలు తమ వైఖరి స్పష్టం చేయాలని మంత్రి కొండ్రు మురళి కోరారు. కాంగ్రెస్‌తో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ అని, ఎవరు మాట్లాడినా అది తమ వ్యక్తిగత అభిప్రాయం కిందే పరిగణించాలని…

ఆర్టీపీపీలో నిర్వాసితుల ఆందోళన

కడప: ఎర్రగుంట్ల మండలం కలమల వద్ద రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టులో నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఆరో యూనిట్‌ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. నిర్మాణ పనులు చేపట్టిన ఇందు సంస్థ కార్యాలయంపై దాడికి దిగారు. కంప్యూటర్లు, వాహనాల అద్దాలు…

అరకు సమీపంలో పట్టాలు తప్పిన గూడ్స్‌ రైలు

అరకు : విశాఖ జిల్లా అరకు సమీపంలోని గోరాపూర్‌ వద్ద ఈ ఉదయం కిరండోల్‌ నుంచి విశాఖ వస్తున్న గూడ్స్‌రైలు రెండు బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పాడింది. ఘటనాస్థలికి చేరుకున్న…