Monday, 23 November 2026

సీమాంధ్ర

బ్యాక్సైట్‌కు వ్యతిరేకంగా మన్యంలో ఆందోళన

విశాఖ : బాక్సైట్‌ తవ్వకాలకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం మన్యం బంద్‌కు పిలుపునిచ్చింది. బాక్సైట్‌ ఒప్పందాలను వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలని పాడేరు ఐటీడీఏ వద్ద అఖిలపక్ష నేతలు నినాదాలు చేశారు. దీంతో…

మావోయిస్టులకు చెందిన డంప్‌ స్వాధీనం

విశాఖపట్నం: ఏవోబీ నారాయణపట్నం అటవీ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్లు డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. 5 ల్యాండ్‌మైన్‌లు, 5 రిమోట్‌లు, ఒక నాటు తుపాకి, వైర్‌ బండిల్స్‌, దుస్తులు, విప్లవ సాహిత్యంను స్వాధీనం చేసుకున్నారు. బీఎస్‌ఎఫ్‌ బలగాల కూబింగ్‌ కొనసాగుతుంది.

తెలుగు అమలుకు సభాసంఘం వేయాలి: కిషన్‌రెడ్డి

అనంతపురం : శాసనసభ, మండలిలో తెలుగు సమర్థంగా అమలు చేసేలా సభాసంఘం వేయాలని భాజపా నేత కిషన్‌రెడ్డి కోరారు. తెలుగు ప్రపంచ మహాసభల సందర్భంగా అనంతపురంలో నిర్వహించిన ఓ కార్యక్రమాంలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. సచివాలయంలో మంత్రులు ఉత్తర, ప్రత్యుత్తరాలను…

ముగ్గురు బాలికల అపహరణ

కడప : నందలూరు మండలం దుర్గాపురానికి చెందిన ముగ్గురు బాలికలు అపహరణకు గురయ్యారు. రెండు రోజుల క్రితం పాఠశాల నుంచి ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు బాలికలకు మత్తు మందు ఇచ్చి కిడ్నాప్‌ చేశారు. వీరి నుంచి తప్పించుకొని…

ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు ప్రారంభం

చీరాల : ప్రకాశం జిల్లా ఎన్నార్పీఎం పాఠశాల శతాబ్ది ఉత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. వీటిని మాజీ ఎన్నికల కమిషనర్‌ జీవీజీ కృష్ణమూర్తి ప్రారంభించారు. సభలో పాల్గోన్న తమిళనాడు గవర్నర్‌ కె. రోశయ్య మాట్లాడుతూ పూర్వం విద్యాభివృద్ధికి దాతలు నిస్వార్థంతో…

త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన : మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌

రాజమండ్రి : రైల్వే ప్రాజెక్టుల్లో మన రాష్ట్రానికి అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల  సూర్యప్రకాశ్‌ రెడ్డి అన్నారు. త్వరలో రైలు ఛార్జీలు పెంచే ప్రతిపాదన ఉందని ఆయన రాజమండ్రిలో వెల్లడించారు. రైల్వే…

13 మంది ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి సమీపంలో అటవీశాఖ అధికారులు 13 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 7 దుండగులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడు తిరువణ్టామలై వాసులుగా గుర్తించారు.

పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తున్న నిందితుడి మృతి

ఉంగుటూరు : ఓ కేసులో నిందితున్ని అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తీసుకువస్తుండగా మార్గమధ్యలో మృతిచెందిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. కైకరంలో అక్టోబర్‌ 12న ఓ వ్యక్తితో జరిగిన గొడవ కేసులో…

టెట్‌, డీఎస్సీలకు ఒకే పరీక్ష : మంత్రి పార్థసారధి

శ్రీకాళహస్తి : ఉపాధ్యాయ అర్హతలకు సంబంధించి ఇప్పటివరకు డీఎస్సీ, టెట్‌లకు వేరువేరుగా పరీక్షలు నిర్వహిస్తున్నామని, ఇకపై రెండూ కలిపి ఒకే పరీక్షగా నిర్వహించే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పార్థసారధి అన్నారు. శ్రీకాళహస్తీశ్వరుని దర్శనార్థం శనివారం…

తెలుగుభాషను రక్షించుకోవాలి

కర్నూలు : ప్రపంచ తెలుగు మహాసభల నేపథ్యంలో కర్నూలు జిల్లా యంత్రాంగం కందనవోలు తెలుగు సాంస్కృతిక సంబరాలను నిర్వహిస్తోంది.ఇందులో భాగంగా కలెక్టర్‌ సుదర్శన్‌రెడ్డి, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ కన్నబాబు నేతృత్వంలో తెలుగులో రాద్దాం… తెలుగులో సంతకాలు చేద్దాం…తెలుగును…