Tuesday, 17 November 2026

వార్తలు

ఇరాక్‌లో కారుబాంబు పేలి 21 మంది మృతి

బాగ్దాద్‌ : బాగ్దాద్‌ నగరంలో మంగళవారం పలుచోట్ల వరసగా కారుబాంబులు పేలి 21 మంది మరణించినట్లు సమాచారం. కూరగాయల మార్కెట్లో, బేకరీ పార్కింగ్‌లో ఇలా మొత్తం 7 చోట్ల బాంబులు పేలాయని గాయపడిన పలువురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స…

పోలీస్‌ స్టేషన్‌ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌ : నగరంలోని బషీర్‌బాగ్‌ పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం ఎదుట ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. ఒక కేసు విషయంలో తనకు న్యాయం చేయాలని ఆమె యాసిడ్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలిని నారాయణగూడ పోలీసులు గాంధీ ఆస్పత్రికి…

జలయజ్ఞం అంచనా రూ. 1.26 లక్షల కోట్లు

జలయజ్ఞం కోసం మొత్తం వ్యయం అంచనా రూ. 1.26 లక్షల కోట్లు జటయజ్ఞంలో 21, 435 లక్షల ఎకరాలకు సాగునీరు ఇప్పటి వరకు జలయజ్ఞంలో రూ. 67,208 కోట్లను వ్యయం చేశారు.

సునీల్‌ మిట్టల్‌కు కోర్టు సమన్లు

ఢిల్లీ : అదనపు స్పెక్ట్రం కేటాయింపుల కేసులో భారతీ ఎయిర్‌టెల్‌ ఛైర్మన్‌ సునీల్‌ భారతీ మిట్టల్‌, ఎస్సార్‌ గ్రూప్‌ ప్రమోటర్‌ రవి రుయా, టెలికాం మాజీ కార్యదర్శి శ్యామల్‌ ఘోష్‌, మరో సంస్థలకు ఢిల్లీ కోర్టు సమన్లు జారీ…

శ్రీలంక తమిళుల సమస్యలపై పార్లమెంటులో తీర్మానం

న్యూఢిల్లీ : శ్రీలంక తమిళుల అంశంపై పార్లమెంటులో తీర్మానం ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐరాస మానవ హక్కుల సమావేశంలో శ్రీలంకకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలన్న డిమాండుతో డీఎంకే ఈరోజు యూపీఏ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ట్విట్టర్‌ అకౌంట్‌ తొలగించిన ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌

సిడ్నీ : ఆస్ట్రేలియా క్రికెట్‌ కోచ్‌ మికీ ఆర్థన్‌ ఈ రోజు తన ట్విట్టర్‌ అకౌంట్‌నే మూసేశారు. భారత్‌తో సిరీస్‌లో ఆస్ట్రేలియా మూడు టెస్టుల్లో ఘోరపరాజయం చవిచూడడంతో ఆ జట్టు అభిమానులు మికీని ట్విట్టర్‌ కామెంట్లతో వేధించి వదిలిపెట్టారు.…

కరుణానిధి ప్రకటన ఒక నాటకం

చెన్నై : యూపీఏ నుంచి వైదొలగుతానని కరుణానిధి ప్రకటించడం నాటకమని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత వ్యాఖ్యానించారు. కరుణానిధి ప్రతిపాదనలను పార్లమెంటులో ఆమోదించడం వల్ల ప్రయోజనం లేదని ఆమె అభిప్రాయపడ్డారు.శ్రీలంక తమిళుల ప్రయోజనాలు ఐరాస తీర్మానాల ద్వారానే పరిరక్షించబడాలని జయలలిత…

వ్యక్తికి కత్తిపోట్లు

తూర్పుగోదావరి : తూర్పుగోదావరి జిల్లా రథాలపేటలో దుండగులు ఒక వ్యక్తిపై కత్తితో దాడిచేశారు. తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ప్రత్తిపాడు మండలం వొమ్మంగికి చెందిన గోపిగా గుర్తించారు. దాడికి కారకులు, కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

ఏసీబీకి చిక్కిన ఉప ఖజానా శాఖ అధికారి

తిరుపతి : ఫించన్‌దారుని నుంచి రూ. 5వేలు లంచం తీసుకుంటూ తిరుపతి ఉప ఖజానా శాఖ ఏసీబీకి చిక్కాడు. ఉప ఖజానా కార్యాలయం సీనియర్‌ అకౌంటెంట్‌ క్రాంతికుమార్‌ లంచం తీసుకుంటుండగా వలపన్ని పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

ఏప్రిల్‌ 20న చంద్రబాబు పాదయాత్ర ముగింపు

హైదరాబాద్‌ : ప్రజా సమస్యలపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన ‘వస్తున్నా…మీకోసం’ పాదయాత్ర ఏప్రిల్‌ 20న సభను ఏర్పాటు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మిగిలిన ఆరు జిల్లాల్లో చంద్రబాబు బస్సు యాత్ర చేయనున్నట్లు తెలిపాయి. గత ఏడాది అక్టోబర్‌…