బగిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి బాలరాజు సమావేశం
హైదరాబాద్: గిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి బాలరాజు ఈరోజు లేక్‌వ్యూ అతిధిగృహంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిరిజనుల ఉపప్రణాళిక అమలుపై చర్చించనున్నట్లు సమాచారం.
హైదరాబాద్: గిరిజన ఎమ్మెల్యేలతో మంత్రి బాలరాజు ఈరోజు లేక్‌వ్యూ అతిధిగృహంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో గిరిజనుల ఉపప్రణాళిక అమలుపై చర్చించనున్నట్లు సమాచారం.
కోరుట్ల : కరీంనగర్ జిల్లా కోరుట్లలో ఇంటర్ విద్యార్థినిపై ఓ ఆగంతుకుడు బ్లేడుతో దాడి చేశాడు. విద్యార్థిని పరీక్ష రాసేందుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. గాయంతోనే ఆ విద్యార్థిని పరీక్షకు హాజరైంది.
గంట్యాడ : విజయనగరం జిల్లా గంట్యాడ మండలం బోనంగిలో గ్రామీణ వికాస బ్యాంకులో దుండగులు బుధవారం అర్థరాత్రి చోరీకి విఫలయత్నం చేశారు. తాళాలు పగులగొట్టి దోపిడీకి యత్నించారు. ఉదయం బ్యాంకు తెరిచేందుకు వచ్చిన అధికారులు విషయం గ్రహించి పోలీసులకు…
హుకుంపేట : విశాఖ జిల్లా హుకుంపేట మండలం అల్లంపుట్ గ్రామంలో అతిసారం విజృంభిస్తోంది. గడచిన రెండు రోజుల్లో అతిసారంతో ముగ్గురు గ్రామస్తులు మృతిచెందారు. మరో 16 మంది తీవ్ర స్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు…
ముంబయి : దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 40 పాయింట్లు, నిఫ్టీ 17 పాయింట్లు నష్టాపోయాయి. మెటల్, రియాల్టీ, ఆటో, బ్యాంకింగ్, అయిల్, గ్యాస్ కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి.
హైదరాబాద్: ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాల ఖరారు చేయడం కోసం పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈరోజు ఢిల్లీ వెళ్లనున్నట్లు సమాచారం. సీఎం పర్యటన ఇంకా ఖరారు. కానప్పటికీ ఈ రోజు సాయంత్రం, రేపు ఉదయం కాని ఆయన…
వినుకొండ : గుంటూరు జిల్లా వినుకొండలో రైస్ మిల్లులపై ఈరోజు ఉదయం అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 300 క్వింటాళ్ల చౌక ధరల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
భద్రాచలం : అటవీశాఖ అధికారుల తీరుకు నిరసనగా ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం నందిగామలో మావోయిస్టులు గోడపత్రికలు అంటించారు. గిరిజనులతో పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వని అటవీ అధికారులకు గోడపత్రికల ద్వారా మావోయిస్టుల హెచ్చరికలు జారీచేశారు.
హైదరాబాద్: నగరంలో ఉగ్రవాదులు మరోసారి బాంబు పేలుళ్లకు పాల్పడనున్నారనే కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రద్దీ ప్రాంతాలు, వాణిజ్య సముదాయాలు, ప్రార్థనా మందిరాలు, ప్రధాన బస్టాండ్లలో ఈ రోజు కూడా విస్తృత తనిఖీలు చేపట్టనున్నారు. బుధవారం…
హైదరాబాద్: మూడు నెలల అనంతరం రాష్ట్ర మంత్రివర్గం నేడు సచివాలయంలో సమావేశం కానుంది. ఈ నెల 13 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహంతో పాటు విద్యుత్ కోతలు, దిల్‌సుఖ్ నగర్ బాంబుపేలుళ్లు,…