Monday, 16 November 2026

వార్తలు

స్కార్పియో బోల్తా… నలుగురి మృతి

కట్టంగూర్‌ : నల్గోండ జిల్లా కట్టంగూర్‌ మండలం అయిటిపాముల వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వేగంగా వెళ్తున్న స్కార్పియో అదుపుతప్పి బోల్తా పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరోకరిని సమీపంలోని ఆస్పత్రికి…

రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు

న్యూఢిల్లీ  : రాష్ట్రానికి 11 ఏకలవ్వ గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వ నిర్యయించింది. ఈరోజు సమావేశమైన కేంద్ర కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉత్తరప్రదేశ్‌ ప్రతాప్‌గఢ్‌లో జరిగిన డీఎస్పీ హత్యకేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించింది.…

కడప కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత

కడప : సమస్యల పరిష్కారం కోరుతూ కడప జిల్లాలో ఆశా వర్కర్లు చేపట్టిన కలెక్టరేట్‌ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఆశా వర్కర్లు కొందరు కలెక్టరేట్‌లోకి చొచుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ తోపులాటలో ఓ మహిళ స్పృహ…

జీహెచ్‌ఎంసీ కార్మికుల రిలే దీక్షలు ప్రారంభం

హైదరాబాద్‌: తమ సమస్యల పరిష్కారం కోరుతూ జీహెచ్‌ఎంసీ కార్మికులు చేపట్టిన 108 రోజుల రిలే దీక్షలను తెరాస ఎమ్మెల్యే హరీశ్‌రావు ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ బడ్జెట్‌ సమావేశాల్లోగా సమస్యలు పరిష్కరించకపోతే కార్మికులతో కలిసి శాసనసభను…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో ఈరోజు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 29,950, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 28,600, వెండి కిలో రూ. 55,300గా ఉంది.

తైవాన్‌లో భూకంపం

తైపీ : తైవాన్‌ రాజధాని తైపీలో భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌ పై 5.6గా నమోదైంది. భూకంపం ధాటికి స్థానికులు భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆస్తినష్టం వివరాలు తెలియాల్సివుంది.

ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్టోపన్‌ తనిఖీలు

హైదరాబాద్‌: నగరంలో ఉగ్రవాద దాడులు జరగవచ్చనే కేంద్ర నిఘా సంస్థ హెచ్చరికల నేపథ్యంలో నగరంలోరని ప్రధాన ప్రాంతాల్లో ఆక్టోపన్‌ పోలీసులు విస్తృత తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఉస్మానియా ఆస్పత్రిలో ఆక్టోపన్‌ పోలీసు బృందం తనిఖీలు చేపట్టింది.

గాలి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై వాదనలు ప్రారంభం

ఢిల్లీ : ఓఎంసీ కేసులో గాలిజనార్థన్‌రెడ్డి ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ న్యాయ ప్రాధికార సంస్థలో ఈరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. గాలి జనార్థన్‌రెడ్డికి చెందిన రూ.884 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌పై ఈడీ వాదనలు వినిపించనుంది. గాలి ఆస్తుల అటాచ్‌మెంట్‌ కోరుతూ…

120 గ్రామాలకు నిలిచిపోయిన మంచినీరు సరఫరా

మహబూబ్‌నగర్‌ : రామనపాడు మంచినీటి పథకం సిబ్బంది ఆకస్మిక సమ్మెతో 120 గ్రామాలకు మంచినీటి  సరఫరా నిలిచిపోయింది. తమకు రావలసిన జీతాల బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ వారు సమ్మెకు దిగారు.

పోలీసుల తనిఖీల్లో రూ. 6 లక్షలు స్వాధీనం

హైదరాబాద్‌: కారులో తరలిస్తున్న రూ. 6 లక్షల నగదును కుషాయిగూడలో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాద దాడుల హెచ్చరికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తుండగా కారులో అక్రమంగా నగదును తరలిస్తున్నట్లు గుర్తించి స్వాథీనం చేసుకున్నారు.