Monday, 16 November 2026

వార్తలు

బొత్సతో ఆర్టీసీ ఈయూ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్‌: డీజిల్‌ ధరలు పెరిగిన నేపథ్యంలో రవాణ శాఖ మంత్రి బొత్స సత్య నారాయణతో ఆర్టీసీ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ప్రతినిధులు భేటీ అయ్యారు. ఆర్టీసీ కొనుగోలు చేసే డీజీల్‌పై పెంచిన ధరలు తగ్గించాలని బొత్సకు వినతి పత్రం  సమర్పించారు.…

కేసీఆర్‌తో మాజీ మంత్రి కోమటిరెడ్డి భేటీ

హైదరాబాద్‌: తెరాస అధినేత కేసీఆర్‌ను ఆయన నివాసంలో మాజీ మంత్రి  కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిశారు. తెలంగాణ అంశంపై కేంద్ర మంత్రి ఆజాద్‌ వ్యాఖ్యల నేపథ్యంలో వీరి భేటీ ప్రాధన్యత సంతరించుకుంది. తెలంగాణపై నిర్ణయానికి కేంద్రానికి మరికొంత సమయం పట్టే…

ఎర్రచందనం పట్టివేత

ఖాజీపేట : కడప జిల్లా ఖాజీపేట మండలం ఏటూరు వద్ద 110 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. 50 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. లారీలో వీటిని తరలిస్తుండగా ముందస్తు సమాచారంతో…

ఓటు హక్కుపై విశాఖలో సైకిల్‌ ర్యాలీ

విశాఖ : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ ఆర్కే బీచ్‌లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా పరిపాలన యంత్రాంగం ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొని సైకిల్‌ యాత్ర చేపట్టారు. ఓటు హక్కు వినియోగం వల్ల…

లాభాలతో స్టాక్‌మార్కెట్లు ప్రారంభం

ముంబయి : స్టాక్‌మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 40 పాయింట్లకుపైగా లాభపడింది. నిప్టీ 5 పాయింట్లకు పైగా లాభంతో కొనసాగుతోంది.

లాలాగూడలో బాలుని కిడ్నాప్‌

హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ లాలాగూడలో ఓ చిన్నారి కిడ్పాప్‌నకు గురయ్యాడు. ఈ ఉదయం ఆరుబయట ఆడుకుంటున్న ముగ్గురు పిల్లలను ఎత్తుకెళ్లేందుకు దుండగులు ప్రయత్నించారు. అయితే ఇందులో ఇద్దరు చిన్నారులు వారి నుంచి తప్పించుకొని వచ్చి తల్లిదండ్రులకు సమాచారమందించారు. దుండగుల చెరలో…

పాతబస్తీలో మిలాద్‌ ఉన్‌ నబీ ర్యాలీ

హైదరాబాద్‌: మహ్మద్‌ ప్రవక్త జయంతి సందర్భంగా మిలాద్‌ ఉన నబీ ర్యాలీ పాతబస్తీలోని మక్కా మసీదు నుంచి ఉదయం ప్రారంభమైంది. మొఘల్‌పురా వరకూ సాగే ఈ ర్యాలీలో పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా పోలీసులు పాతబస్తీలోని…

నేడు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై ఆజాద్‌ ప్రకటన నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఈ రోజు భేటీ అవుతున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా అధిష్ఠానంపై ఒత్తిడి పెంచే వ్యూహాలపై ఈ భేటీలో నేతలు చర్చించనున్నారు.…

550 కేజీల నల్లబెల్లం స్వాధీనం

పుల్లలచెరువు : ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలంలోని ఎం. ఎర్రబాలెం గ్రామంలో నాటు సరా తయారీ కోసం తీసుకువస్తున్న నల్ల బెల్లాన్ని ఎక్స్తెజ్‌ అధికారులు దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. కురిచేడు నుంచి ఎర్రబాలెం గ్రామానికి ఆటోలో 550…

సీఎం, గవర్నర్‌ల మిలాద్‌- ఉన్‌-నబీ శుభాకాంక్షలు

హైదరాబాద్‌: మహ్మద్‌ ప్రవక్త జయంతి మిలాద్‌- ఉన్‌-నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలోని ముస్లిం సోదరులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, గవర్నర్‌ నరసింహన్‌లు శుభాకాంక్షలు తెలిపారు.