Sunday, 15 November 2026

వార్తలు

సన్‌రైజర్స్‌ లోగో విడుదల

హైదరాబాద్‌ : ఐపీసీఎల్‌లో డెక్కన్‌ ఛార్జర్స్‌ను చేజిక్కించుకుని సన్‌ రైజర్స్‌గా పేరు మార్చిన సన్‌ గ్రూప్‌ గురువారం తమ జట్టు లోగోను హైదరాబాద్‌లో విడుదల చేసింది. ఈ సందర్భంగా సన్‌ గ్రూప్‌ ప్రతినిధులు మాట్లాడుతూ జట్టు కెప్టెన్‌గా ప్రస్తుతం…

2014లో హంగ్‌ తప్పదు : సీపీఐ నారాయణ

నెల్లూరు : గుజరాత్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే 2014లో కేంద్రంలో హంగ్‌ అసెంబ్లీ తప్పదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ జోస్యం చెప్పారు. భాజపా, కాంగ్రెస్‌ పార్టీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవన్నారు. కాంగ్రెస్‌ పార్టీ…

కాంగ్రెస్‌ బలపడింది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో అధికారం అందుకోలేనప్పటికీ సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలపడిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలు వస్తాయన్న భాజపాకు తక్కువ సీట్లు రావడం ఇందుకు తార్కాణమన్నారు.

నాలుగోరోజుకు చేరుకున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు

హైదరాబాద్‌ : గచ్చిబౌలిలోని మానస సరోవర్‌ ప్రాంగణంలో జరుగుతున్న ప్రపంచ ఆధ్యాత్మిక మహాసభలు నేటితో నాలుగోరోజుకు చేరుకున్నాయి. సద్గురు మంగేష్ఠ క్రియ యోగ గురువారం సభలో పాల్గొని ప్రసంగించారు. యోగ, ధ్యానం మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి వివేచనశక్తిని అభివృద్ధి…

నాటు తుపాకీతో కాల్చుకుని ఇద్దరి మృతి

ఆళ్లగడ్డ : కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం అహోబిలంలో నాటు తుపాకి కాల్చుకుని ఇద్దరు మృతి చెందిన సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన రవి, శివమ్మలు మృతిచెందారు. తమ అక్రమ సంబంధం భర్తకు…

జగన్‌ బెయిల్‌పై హైకోర్టులో వాదనలు ప్రారంభం

హైదరాబాద్‌ : వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో రెండోరోజు వాదనలు ప్రారంభమయ్యాయి. పెట్టుబడుల కేసులో తనకు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ జగన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై బుధవారమే వాదనలు విన్న…

75 వేల ఓట్ల ఆధిక్యంతో మోడీ విజయబావుటా

గాంధీనగర్‌ : గుజరాత్‌ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మణినగర్‌ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి శ్వేతాభట్‌పై 75000 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

పాలనకు పట్టం కట్టారు : నరేంద్రమోడీ

గాంధీనగర్‌ : గుజరాత్‌ ఉజ్వల భవిష్యత్తుకు ప్రజలు తిరిగి పట్టం కట్టారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం సాధిండంపై ఆయన  .

మోడీ విజయంపై స్పందించని నితీష్‌

పాట్నా : గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ హ్యాట్రిక్‌ విజయంపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ ఎటువంటి వ్యాఖ్య చేయలేదు. ఎన్డీయే అభ్యర్థిగా మోడీని ప్రకటించాలన్న భాజపాలోని కొందరి ప్రతిపాదనలపై జేడీయూ అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

ప్రధాని అభ్యర్థిగా మోడీ అర్హుడు : కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ : ప్రధాని పదవికి నరేంద్రమోడీ అర్హుడని రాష్ట్ర భాజపా అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. విపక్షాలు ఎన్ని ఆరోపణలు చేసినప్పటికీ గుజరాత్‌ ప్రజలు మోడీకి అండగా నిలిచారని అన్నారు.