Friday, 13 November 2026

వార్తలు

ఎర్రచందనం చెట్లు నరికే 26 మంది కూలీల అరెస్టు

యాదమర్రి: చిత్తూరు జిల్లాలోకి ప్రవేశిస్తున్న 26 మంది ఎర్రచందనం చెట్లను నరికే కూలీలను యాదమర్రి పోలీసులు అరెస్టు చేశారు. ఓ ప్రైవేటు బస్సులో తమిళనాడు రాష్ట్రం నుంచి వస్తుండగా తనిఖీలు చేపట్టి వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు.

ట్రాక్టర్‌ బోల్తా.. ఇద్దరు మృతి

హాలియా: నల్గొండ జిల్లా హాలియా సమీపంలో ఓ ట్రాక్టర్‌ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా.. నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని సమీప ఆసుపత్రికి తరలించారు

రామగుడం ఎన్టీపీసీలో సాంకేతిక లోపం

కరీంనగర్‌: రామగుండం ఎన్టీపీసీ 5 యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో  500 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. వార్షిక మరమ్మతుల నిమిత్తం ఆరోయూనిట్‌లో 500 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది.

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 42 పాయింట్లకు పైగా నష్టపోయింది. అటు నిఫ్టీ కూడా 14 పాయింట్లకు పైగా నష్టంతో కొనసాగుతోంది.

ఎట్టకేలకు కింగ్‌ ఫిషర్‌ సమ్మె విరమణ

న్యూఢిల్లీ, అక్టోబర్‌ 25 (జనంసాక్షి): కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ యాజమాన్యనికి, సిబ్బందికి బకాయి వేతనాలపై గురువారం ఒప్పందం కుదరడంతో సమ్మె విరమించేందుకు సిబ్బంది సుముఖత వ్యక్తం చేశారు. దీంతో వచ్చే నెల కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ తిరిగి…

‘రాజకీయ సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ’: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు సంక్షోభం సృష్టిస్తేనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడం పెద్దకష్టం కాదని తెలంగాణ జేఏసీ ఛైర్మన్‌ ప్రొ. కోదండరాం అన్నారు. నవంబర్‌ 1 ఆంద్రప్రదేశ్‌ అవతరణను తెలంగాణ ప్రాంత మంత్రులు బహిస్కరించాలని తెలంగాణ జేఏసీ…

విహార యాత్రలో విషాదం

కాశ్మీర్‌: విజయవాడకు చెందిన వి. ఆర్‌.సిద్థార్థ ఉన్నత పాఠశాల విహారయాత్రలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పహెల్గాం సమీపంలో లిద్దర్‌ వంతెనపై నుంచి కాలువలో జారిపడి తొమ్మిదో తరగతి విద్యార్థి హేమంత్‌ మృతి చెందాడు.

మాజీ ప్రధాని, కేంద్ర మంత్రిలపై విచారణకు లోకాయుక్త ఆదేశం

మాజీ ప్రధాని దేవెగౌడ. కేంద్రమంత్రి ఎన్‌ఎం కృష్ణ. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పలపై విచారణకు లోకాయుక్త ఆదేశాలు జారీ చేసింది. నంది ఇన్‌ఫ్రాస్టక్చర్‌ కారిడార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ కేసులో వారిపై కర్ణాటక లోకాయుక్త విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

మరోసారి పెట్రోలు ధరల పెంపు

ఢిల్లీ: మరోసారి పెట్రో ధరలు పెరిగాయి. పెట్రోలు ధర లీటరుకు 30 పైసలు పెరగగా, డీజిల్‌ ధర లీటరుకు 18 పైసలు పెరిగింది.