Friday, 13 November 2026

వార్తలు

మోపిదేవి బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో అరెస్టయిన మోపిదేవి వెంకటరమణ బెయిల్‌పిటిషన్‌ విచారణను సీబీఐ న్యాయస్థానం ఈ నెల 9కి వాయిదా వేసింది. బెయిల్‌ పిటిషన్‌పై మోపిదేవి తరపు న్యాయవాది, సీబీఐ న్యాయవాదులు తమ వాదనలు ముగించారు. ఇరుపక్షాల వాదనలు…

ఇండోనేషియాలో భూకంపం

జకర్తా: ఇండోనేషియాలోని కెపులావన్‌బాటు సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 5.7గా నమోదయింది.

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి: వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంలో కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు కోరారు. తెలంగాణపై ఇప్పటికే స్పష్టమైన వైఖరి ప్రకటించిందన్న సంగతిని ఆయన గుర్తుచేశారు. ఎలాంటి జాప్యం చేయకుండా కేంద్రం నిర్ణయాన్ని వెలువరించాలని ఆయన డిమాండ్‌…

శంషాబాద్‌ విమానాశ్రయంలో రేణుకాచౌదరిని అడ్డుకున్న తెరాస శ్రేణులు

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేత రేణుకాచౌదరిని శంషాబాద్‌ విమానాశ్రయంలో తెరాస శ్రేణులు అడ్డుకున్నాయి. ఢిల్లీనుంచి వచ్చిన ఆమె బయటకు వెళుతుండగా తెరాస కార్య కర్తలు ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తానూ తెలంగాణ బిడ్డనే నంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం…

ఎంబీబీఎస్‌ పార్ట్‌-2 ఫలితాల విడుదల

విజయవాడ: ఆగస్టులో జరిగిన ఎంబీబీఎస్‌ చివరి ఏడాది పార్ట్‌ -2 ఫలితాలను విడుదల చేసినట్టు ఎన్టీఆర్‌ ఆరోగ్య వైద్య విశ్వవిద్యలయం తెలిపింది. యూనివర్శిటీ వెబ్‌సైట్లో ఫలితాలను వీక్షించవచ్చు. బీడీఎస్‌ ఫైనల్‌ ఫలితాలను కూడా విడుదల చేసినట్టు యూనివర్శిటీ అధికారులు…

సికింద్రాబాద్‌-ముబయిల మధ్య 12 ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌: దసరా, దీపావళి పండుగల సందర్భంగా సికింద్రాబాద్‌-ముంబయిల మధ్య 12 ప్రత్యేక ఏసీ రైళ్లను నడపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 14 నుంచి నవంబరు 19 వరకు ఈ రైళ్లు నడుస్తాయని రైల్యే అధికారులు తెలిపారు.

లాభాలతో ముగిసిన సెన్సెక్స్‌

ముంబయి: సెన్సెక్స్‌ 45.78 పాయింట్ల లాభంతో 18,869.69 పాయింట్ల వద్ద నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌ 12.45 పాయింట్ల ఆధిక్యంతో 5,731.25 వద్ద స్థిరపడ్డాయి. చమురు, గ్యాస్‌, పబ్లిక్‌ రంగ సంస్థలు, ఆరోగ్య లిమిటెడ్‌, హిందుస్థాన్‌ యూనిలివర్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ,…

సోనియా గుజరాత్‌లో ఎన్నికల ప్రచారం

రాజ్‌కోట్‌: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ గుజరాత్‌లో ఆ రాష్ట్ర విధానసభ ఎన్నికలకు ప్రచారాన్ని ప్రారంభించారు. భాజపా రాష్ట్రాల్లోనే అవినీతి అధికంగా ఉందని ఆమె తన ప్రసంగంలో పేర్కొన్నారు. తన వైద్యఖర్చులపై మోడీ చేస్తున్న విమర్శలపై వ్యాఖ్యానించేందుకు ఆమె నిరాకరించారు.

ప్రజల కష్టాలు తెలుసుకునేందుకే పాదయాత్ర చేస్తూనాను: బాబు

అనంతపురం: పిల్లకాంగ్రెస్‌ త్వరలోనే పెద్దకాంగ్రెస్‌లో కలిసిపోతుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జోస్యంచెప్పారు. ఆయన చాలకూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్‌ ఛార్జీలను ప్రభుత్వం పెంచడంపై మండిపడ్డారు. ప్రజల కష్టాల తెలుసుకునేందుకే తాను పాదయాత్ర ప్రారంభించినట్టు ఆయన…

హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీజీపీ

హైదరాబాద్‌: జీవవైవిధ్యసదస్సు జరుగుతున్న హైటెక్స్‌లో భద్రతా ఏర్పాట్లను డీజీపీ దినేష్‌రెడ్డి పరిశీలించారు. ఈ నెల 16న ప్రధాని మన్మోహన్‌సింగ్‌ సమావేశాలకు హాజరవుతున్నదున భద్రతను సమీక్షించినట్టు ఆయన తెలిపారు.