Friday, 13 November 2026

వార్తలు

జంట నగరాల్లో కొనసాగుతున్న బంద్‌

హైదరాబాద్‌:  ఓయూ విద్యార్థి ఐకాస పిలుపుమేరకు  జంట నగరాల్లో  బంద్‌ కొనసాగుతోంది. బంద్‌ నేపథ్యంలో పలు విద్యాసంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఓయూ పరిసర ప్రాంతాలు మినహా యధావిధిగా నడుస్తున్నాయి. గణేష్‌ నిమజ్జనం, తెలంగాణ కవాతు నేపథ్యంలో రెండు…

మోత్కులపల్లి ట్రాన్స్‌ఫార్మర్లను పేల్చి తీగల చోరీ

హుస్నాబాద్‌ : మండలంలోని మోత్కులపల్లి గ్రామంలో రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను పగలగోట్టి అందులోని కాపర్‌తీగలను దుండగులు దోచుకెళ్లారు, విద్యుత్‌ సిబ్బంది దీనిపై పోలిసులకు ఫిర్యాదు చేశారు.

మధ్యాహ్నం తెలంగాణ ఎంపీలు, మంత్రుల సమావేశం

హైదరాబాద్‌: మధ్యాహ్నం 12.30 గంటలకు తెలంగాణ ఎంపీలు, మంత్రులు సమావేశం కానున్నారు. సమావేశం అనంతరం భవిష్యత్‌ కార్యాచరణపై ప్రకటించనున్నట్లు సమాచారం.

పోలీసుల నిర్భందంలో ఓయూ క్యాంపస్‌

హైదరాబాద్‌: ఉప్మానియా యూనివర్శిటీని పోలీసులు నిర్భంధంలోకి తీసుకున్నారు. ఓయూకు వెళ్లే దారులన్నింటిని మూసివేశారు. బంద్‌ ఉన్నందున ముందస్తు చర్యల్లో భాగంగా క్యాంపస్‌ వద్ద భారీగా జలగాలను మోహరించారు.

నేటి నుంచి జీవ వైవిధ్య సదస్సు

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు తొలిఘట్టం ఉదయం పది గంటలకు హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ప్రారంభం కానుంది. 193 సభ్యదేశాల ప్రతినిధులు పాల్గొనే ఈ సదస్సు ఈ నెల 19వ తేదీ వరకూ జరగనుంది.…

కొత్తపేట టెలిఫోన్‌ ఎక్స్ఫేంజి కార్యాలయంలో అగ్ని ప్రమాదం

మహబూబ్‌నేగర్‌: కొత్తపేట టెలిఫోస్‌ ఎక్స్ఫేంజి కార్యాలయంలో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో కొన్ని పరికరాలు, ఫర్నీచర్‌ దగ్థమయ్యాయి, ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

కొలంబియాలో భారీ భూకంపం

బోగోట: కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 7.1గా నమోదైంది. దక్షిణ కొలంబియాలోని ప్రాంతీయ రాజధాని పోపయాస్‌కు 30 కిలోమీటర్ల దూరంలో ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత భారీ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు అక్కడి అధికారులు…

విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరి మృతి

ఒంగోలు: రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ఒంగోలు పట్టణంలోని మస్తాన్‌ దర్గావద్ద విద్యుత్‌ తీగలు తెగిపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. తెల్లవారుజాము 4 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కూరగాయల మార్కెట్‌కు ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు…

నేడు తెలంగాణ బంద్‌

హైదరాబాద్‌: ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షను శాంతియుతంగా తెలియజేయడానికి నిర్వహించిన కవాతును ప్రభుత్వం హింసాత్మకంగా మార్చిందని ఆరోపిస్తూ టీఎస్‌ జాక్‌,  ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్ధి జేఏసీలు నేడు బంద్‌కు పిలుపునిచ్చారు.

సీఎంతో ముగిసిన హోంమంత్రి డీజీపీ భేటీ

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో ఆదివారం రాత్రి క్యాంపు కార్యాలయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిల భేటీ ముగిసంది. తెలంగాణ కవాతు నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకూ జరిగిన ఘటనలపై సీఎం సమీక్షించినట్లు సమాచారం. శాంతిభద్రతనలు…