Friday, 13 November 2026

వార్తలు

టీ ఎంపీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు

హైదరాబాద్‌: తెలంగాణవాదుల అరెస్టులను నిరసిస్తూ సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు యత్నించిన తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని ఎన్‌.ఆర్‌. నగర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు ఎంపీలు పోలీసుల చర్యకు  నిరసనగా…

అసెంబ్లీ ఎదుట తెదేపా ఎమ్మెల్యేల రాస్తారోకో

హైదరాబాద్‌: కవాతుకు వస్తున్న తెలంగాణవాదులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ తెలంగాణ తెదేపా ఎంపీలు అసెంబ్లీ ముందు రాస్తారోకోకు దిగారు. అయితే ఇక్కడ అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో పోలీసులు…

క్లాక్‌టవర్‌ నుంచి ర్యాలీగా బయలుదేరిన కవిత

హైదరాబాద్‌: తెలంగాణ వచ్చే వరకూ పోరాటం సాగిస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ కవాతుకు మద్దతుగా సికింద్రాబాద్‌ క్లాక్‌టవర్‌ నుంచి కార్యకర్తలతో ఆమె ర్యాలీగా బయలుదేరారు. కవాతును అడ్డు కోవద్దని ఆమె పోలీసులకు విజ్ఞప్తి చేశారు.…

ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట ధర్నాకు ఎంపీల యత్నం

హైదరాబాద్‌: కవాతులో పాల్గొనేందుకు వస్తున్న నేతలను పోలీసులు అడ్డుకోవడంపై తెలంగాణ కాంగ్రెస్‌  ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా మధుయాస్కీ, వివేక్‌, పొన్నం, గుత్తా, రాజయ్య తదితర ఎంపీలు సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ధర్నాకు…

ప్రభుత్వ వైఖరిపై మండిపడ్డ తెలంగాణ ఎంపీలు

హైదరాబాద్‌: కవాతులో పాల్గొనేందుకు జిల్లాల నుంచి వస్తున్న నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు మండిపడ్డారు. ప్రభుత్వవైఖరికి నిరసనగా సీఎం క్యాంపు కార్యాలయం ముందు ఎంపీలు ధర్నా చేయాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

ఓయూలో భాష్ప వాయు ప్రయోగం

హైదరాబాద్‌: మార్చ్‌కు ర్యాలీగా బయల్దేరిన ఓయూ విద్యార్థులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరిపారు. భాష్పవాయు ప్రయోగం జరువుతూనే విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. పలువురి విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్‌సీసీ గేటు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు…

ఓ చేత్తో అనుమతిచ్చి…మరో చేత్తో అడ్డగిస్తున్నారు: కోదండరాం

హైదరాబాద్‌: ప్రభుత్వం కవాతు నిర్వహించుకోవడానికి ఓ చేత్తో అనుమతి ఇచ్చి.. మరో చేత్తో అడ్డగిస్తోందని తెలంగాణ ఐకాస అధ్యక్షుడు కోదండరాం ధ్వజమెత్తారు. కవాతు భయంతో పాలన నిర్వహించుకోలేక సచివాలయం మొదలు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ప్రభుత్వం తాళాలు వేసుకుందని…

ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు భేటీ

హైదరాబాద్‌: పెద్దపల్లి ఎంపీ వివేక్‌ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు సమావేశమయ్యారు. తెలంగాణ మార్చ్‌లో పాల్గోనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మంత్రులు , ఎంపీలు పదవులకు రాజీనామా చేసి మార్చ్‌లో పాల్గోనాలని ప్రజాసంఘాలు, విద్యార్ధి సంఘాలు హెచ్చరించిన…

నేడు పాక్‌తో భారత్‌ పోరు

కొలంబో: చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో నేడు భారత్‌ తలపడనుంది. సూపర్‌-8లో న్యూజిలాండ్‌పై గెలుపుతో పాక్‌ ఉత్సహంగా ఉండగా.. ఎలాగైనా ఈ మాచ్చ్‌ గెలిచి టీ 20లో సెమీన్‌ ఆశలు సజీవంగా ఉంచుకోవాలని టీం ఇండియా గట్టికసరత్తు చేస్తోంది. రాత్రి…

సీపీఐఎంఎల్‌ కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు.

  ఖమ్మం: తెలంగాణ మార్చ్‌ కోసం సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ పార్టీ కార్యదర్శి అధ్వర్యంలో వంద మంది కార్యకర్తలు హైదరాబాద్‌కు బయలుదేరారు. మార్చ్‌కు అనుమతిచ్చిన ప్రభుత్వం పలు రైళ్లను రద్దు చేయడం కుట్రపూరితమని అన్నారు ఎన్ని అవాంతరాలు సృష్టించినా కవాతును…