Friday, 13 November 2026

వార్తలు

వేదిక వైపు మరోమారు టీయర్‌ గ్యాస్‌ ప్రయోగం

సభావేదిక వద్ద రెచ్చి పోయిన పోలీసులు. సభావేదిక వేెనుక భాష్పవాయువు వ్రయోగం ఉద్రిక్తపరిస్థితి, 5నుంచి ఆరు రౌండ్లు ప్రయోగం తీవ్ర ఉద్రిక్త వాతవరణం

ఇలాగైతే రాజీనామాలు చేస్తాం:జానారెడ్డి

హైదరాబాద్‌: కవాతుకు వస్తున్న తెలంగాణవాదుల అరెస్టుపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడానని మంత్రి జానారెడ్డి తెలియజేశారు. కవాతు నిర్వహణ విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కవాతు కోసం హైదరాబాద్‌ బాట పట్టిన తెలంగాణవాదులను అరెస్టు చేయడంపై…

ప్రశాంతంగా ఉద్యమం చేసుకోవాలి: రాజనర్సింహ

హైదరాబాద్‌:  తెలంగాణ మార్చ్‌ సందర్భంగా ఆందోళనకారులు ప్రశాంతంగా ఉద్యమం చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రాజనర్సింహ విజ్ఞప్తి చేశారు. ఉద్యమకారులను నిర్బంధించడం తగదన్నారు. ఉద్యమం అహింసాయుతంగా సాగాలన్న ఆకాంక్షను ఆయన వ్యక్తంచేశారు.

ఓయూలో కొనసాగుతున్న ఉద్రిక్తత

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (జనంసాక్షి) :ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విద్యార్ధులు మరోసారి ఆందోళనకు దిగారు. తెలంగాణ మార్చ్‌కు ఏర్పాటుకు కాంగ్రెస్‌ పార్టీయే అడ్డుంటూ ఆరోపిస్తూ ర్యాలీకి దిగారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినా దాలు…

తెలంగాణ కోసం మరో బలిదాం

హైదరాబాద్‌: తెలంగాణ కోసం మరో విద్యార్థి నెలకొరిగాడు. తెలంగాణలో అక్రమ  అరెస్టులు ఆపాలని కోరుతూ రైలు కింద పడి విద్యార్థి నెలకొరిగాడు. తెలంగాణలో అక్రమ అరెస్టులు ఆపాలని కోరుతూ రైలు కింద పడి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ…

అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరం:కె.కేశవరావు

హైదరాబాద్‌: అధికార పార్టీ ఎంపీలను అరెస్టు చేయడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత. కె. కేశవరావు మండిపడ్డారు. సీఎంను కలిసేందుకు వచ్చిన ఎంపీలను అనుమతించకపోవడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. సీఎం క్యాంపు కార్యాలయం వద్ద తెలంగాణ…

హోంమంత్రితో ముగిసిన టీఆర్‌ఎస్‌ భేటీ

హైదరాబాద్‌: హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల భేటీ ముగిసింది. అరెస్టులు ఆపాలని హోంమంత్రికి విజ్ఞప్తి చేశామని ఎమ్మెల్యేలు తెలియజేశారు. మార్చ్‌ను విఫలం చేసేందుకే పోలీసులు కుట్ర పన్నారని ఈటెల రాజేందర్‌ ఆరోపించారు. పోలీసులు అరెస్టులు ఆపకపోతే పరిస్థితులు…

తెలంగాణ వాదులను అడ్డుకున్న పోలీసులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్దకు తెలంగాణవాదులు పెద్దసంఖ్యలో చేరుకున్నారు. కవాతుకు వస్తున్న నేతల అరెస్టును నిరసిస్తూ తెలంగాణవాదులు క్యాంపు కార్యాలయ ముట్టడికి యత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

ముఖ్యమంత్రి క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్‌: సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి., తెలంగాణ, కాంగ్రెస్‌ ఎంపీలు మళ్లీ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. సీఎంతో మాట్లాడేంత వరకు తమూ ఇక్కడి నుంచి కదలమని తేల్చిచెబుతున్నారు. సీమాంధ్ర పోలీసులు…

తెలంగాణ భవన్‌లో యువకుడి ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: తెలంగాణ భవన్‌లో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెట్రోల్‌ పోసుకుని నిప్పటించుకున్నారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.