Thursday, 12 November 2026

వార్తలు

మావోయిస్టులకు సహకరిస్తున్నారని అరెస్టు

విశాఖపట్నం: మావోయిస్టులకు సహకరిస్తున్నారన్న కారణంగా ఆంధ్రా, ఒడిశా సరిహద్దు (ఏవోబీ) లోని బడదురల్‌ గ్రామంలో సర్పంచ్‌, మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి దగ్గరనుంచి పోలీసులు రెండు మందుపాతలు, ఒక తపంచా స్వాధీనం చేసుకున్నారు.

కొత్త వంటగ్యాస్‌ కనెక్షన్లపై ఎలువంటి నిషేదం లేదు

న్యూఢిల్లీ: కొత్త వంటగ్యాస్‌ కనెక్షన్ల జారీపై ఎటువంటి నిషేదం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. నకిలీ కనెక్షన్లను నివారించేందుకు కొత్త కనెక్షన్ల జారీని మూడు వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసనట్టు పేర్కొంది. ఒకే ఇంటిలో ఉండే బహుళ…

కమ్యూనిటీ రేడియో సేవలను మరింత ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశంలో కమ్యూనిటీ రేడియో సేవలను(సీఆర్‌ఎన్‌) మరింతగా ప్రోత్సహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి సేవలపై స్పెక్ట్రం రుసుమును రద్దు చేయాలని నిర్ణయించినట్లు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. సామాన్య ప్రజానీకానికి సమాచారం అందజేస్తూ వారి ప్రగతికి దోహదపడుతున్న…

కాశ్మీరులో పరిస్థితులు క్రమంగా మెరుగవుతోంది: రాష్ట్రపతి

న్యూఢిల్లీ: కాశ్మీరులో పరిస్థితులు క్రమంగా మెరుగవుతున్నాయని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చెప్పారు. లోయలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన వివిధ వర్గాల ప్రతినిధులతో భేటీ అయ్యారు. కాశ్మీరులో పరిస్థితులు మెరుగుపడుతున్నాయన్న నమ్మకం కుదిరింది. అని ప్రణబ్‌ శ్రీనగర్‌…

పేదరికం నిర్మూలనకు జీవ వైవిద్యం కీలకం: మంత్రి జయంతి

న్యూఢిల్లీ: పరిశ్రమలు, గనులు ఇతర ప్రాజెక్టుల పర్యావరణ, అటవీ అనుమతుల్లో జీవ వైవిధ్య పరిరక్షణను ఒక అంశంగా చేరుస్తామని కేంద్ర పర్యావరణ మంత్రి జయంతి నటరాజన్‌ ప్రకటించారు. హైదరాబాద్‌లో సోమవారం అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు ప్రారంభం అవుతున్న…

ప్రజల మనోభావాలను బాబు గుర్తించాలి: శైలజనాథ్‌

హైదరాబాద్‌: ఢిల్లీలో లాబీలు చేసేంత శక్తిమంతుడిని కానని మంత్రి శైలజానాథ్‌ అన్నారు. శుక్రవారం సీఎల్పీ కార్యాలయం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. తెదేపా అధినేత చంద్రబాబు ఎవరు అడగకముందే తెలంగాణపై లేఖ ఇచ్చారన్నారు. ఎవరి ఆలోచనకు తోచిన విధంగా…

రాగల 48 గంటల్లో భారీ వర్షలు

న్యూఢిల్లీ: మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. అల్పపీడనం ఏర్పడటంతో రాగల 48 గంటల్లో కోస్తాంద్ర, తెలంగాణ, రాయలసీమలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

అధికార పార్టీలో ఉండి కవాతుకు అనుమతి తీసుకురాలేనందుకు సిగ్గుగా లేదా: భాజపా

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠకు పోకుండా తెలంగాణ కవాతుకు అనుమతి విషయాన్ని పున:క్షించాలని భాజపా తెలంగాణ ఉద్యమ కమిటీ ఛైర్మన్‌ రాజేశ్వరరావు కోరారు. శుక్రవారమిక్కడ పార్టీ నాయకలు దాసరి మల్లేశం, హనీఫ్‌ అలీ, రాములుతో కలిసి ఆయన విలేకరుల…

ఆస్ట్రేలియా విజయలక్ష్యం 141 పరుగులు

కొలంబో: ట్వంటీ 20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్‌-8లో భారత్‌ 140 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా విజయలక్షయ్యం 141 పరుగులు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది.…

బట్టల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం

మహబూబ్‌నగర్‌: ధన్వాడ మండలం మరికల్‌లోని ఓ బట్టల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బట్టల దుకాణం పూర్తిగా దగ్దమైంది. రూ. 10 లక్షల ఆస్తి నష్టం సంభవించనట్టు సమాచారం.