Wednesday, 11 November 2026

వార్తలు

తెలంగాణ మార్చ్‌ ఖచ్చితంగా జరుగుతుంది: కోదండరాం

హైదరాబాద్‌: సెప్టెంబర్‌ 30న తెలంగాణ రాజకీయ జేఏసీ నిర్వహించబోయే ‘ తెలంగాణ మార్చ్‌’ను శాంతియుతంగా, ప్రశాంత వాతావరణంలో జరపాలని జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం తెలంగాణ ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ప్రజలు సహకరించాలని ఆయన విన్నవించారు. ఎట్టి…

సమితి గుడ్‌విల్‌ అంబాసడర్‌గా ఐశ్వర్యారాయ్‌

  న్యూయార్క్‌ ప్రముఖ బాలీవుడ్‌ నటి,ఒకనాటి ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్‌ ఐక్యరాజ్యసమితి గుడ్‌విల్‌ అంబసాడర్‌గా నియమితులయ్యారు. ఈ హోదాలో యూఎన్‌ ఎయిడ్స్‌ తరపున ఐశ్వర్య పనిచేస్తున్నారు. ఐక్యరాజ్యసమితితో కలిసి పనిచేసే అవకాశం లభించడం తన అదృష్టంగా ఐశ్వర్య పెర్కోన్నారు. ఈ…

తెలంగాణ కవాతుపై కిషన్‌రెడ్డితో ఐకాస నేతల భేటీ

హైదరాబాద్‌: తెలంగాణ కవాతుకు రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాన్ని ఐకాస వేగవంతం చేసింది. హైదరాబాద్‌లోని భాజపా  కార్యాలయానికి వచ్చిన ఐకాస నేతలు కోదండరాం, స్వామిగౌడ, విఠల్‌ తదితరులు సాగరహారం మార్చ్‌కు కలిసి రావాలంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు…

ముఖ్యమంత్రి పర్యటనలో విద్యుత్‌ కోతలపై నిరసన

విజయవాడ: కృష్ణా జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇందిరమ్మ బాట కార్యక్రమం నిరసనలతో ప్రారంభమైంది. సీఎం గన్నవరం బావాజీగూడెం రహదారి శంకుస్థాపన చేస్తున్న సమయంలో భవన నిర్మాణ కార్మికులు, రైతులు ఒక్కసారిగా తమ నిరసన తెలియజేశారు. విద్యుత్‌ కోతలతో ఉపాధి…

జగన్‌ రిమాండ్‌ వచ్చే నెల 9కి పొడిగింపు

హైదరాబాద్‌:జగన్‌ అక్రమాస్తుల కేసులో తదుపరి విచారణను సీబీఐ కోర్టు అక్టోబర్‌ 9కి వాయిదా వేసింది. ఈకేసులో అరెస్టయిన జగన్‌, మాజీ మంత్రి మోపిదేవి, నిమ్మగడ్డ, బ్రహ్మానందరరెడ్డిలకు వచ్చే నెల 9 వరకు రిమాండ్‌ను పొడిగించింది, మంత్రి ధర్మాన ప్రసాదరావు,…

ధర్మానపై తదుపరి విచారణ వచ్చే నెల 9కు వాయిదా

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ భూకేటాయింపుల వ్యవహారం కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుపై తదుపరి విచారణను నాంపల్లి కోర్టు అక్టోబర్‌ 9కు వాయిదా వేసింది. రూ. 25 వేలు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును ధర్మాన కోర్టుకు సమర్పించారు.

ధర్మానతో కరచాలనం చేసిన జగన్‌

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో సీబీఐ న్యాయస్థానంలో హాజరైన వైకాపా అధినేత జగన్‌.. ఇదే కేసులో కోర్టుకు వచ్చిన మంత్రి ధర్మాన ప్రసాదరావును పలకరించారు. కోర్టు హాల్‌లో ఆయన ధర్మానతో కరచాలనం చేశారు.

నాంపల్లి సీబీఐ కోర్టులో జగన్‌ను హాజరుపరిచిన పోలీసులు

హైదరాబాద్‌: నాంపల్లి సీబీఐ కోర్టులో వైఎస్‌ జగన్‌ను పోలీసులు హాజరుపరిచారు. అంతకుముందు అయన్ను చంచల్‌గూడ జైలు నుంచి భారీ బందోబస్తు మధ్య కోర్టుకు తరలించారు. ఈ కేసులో మాజీ మంత్రి మోపిదేవి, నిమ్మగడ్డ ప్రసాద్‌, విజయ సాయిరెడ్డిలతోపాటు ఐఏఎస్‌…

ఏసీబీ కోర్టులో హాజరైన గాలి జనార్దన్‌రెడ్డి

హైదరాబాద్‌: బెయిల్‌ ముడుపుల కుంభకోణంకేసులో గాలి జనార్ధన్‌రెడ్డి నాంపల్లి ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. భారీ భద్రత మధ్య ఆయన్ను కోర్టుకు తీసుకువచ్చారు.

సీబీఐ అభియోగాలకు ధీటైన సమాధానం చెబుతా: ధర్మాన

హైదరాబాద్‌: వాన్‌పిక్‌ భూముల్లో తన పాత్ర లేదని మంత్రి ధర్మాన మరోసారి స్పష్టం చేశారు. సీబీఐ కోర్టులో హాజరయ్యేముందు ధార్మన  మీడియాతో మాట్లాడారు. సీబీఐ తనపై మోపిన అభియోగాలకు ధీటైన సమాధానం చెబుతానని అన్నారు, ఈ కేసులో ఇతర…