Wednesday, 11 November 2026

వార్తలు

ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ

హైదరాబాద్‌: సీబీఐ, ఏసీబీ అధికారులు ఈరోజు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఏసీబీ డీజీ ప్రసాదరావుతో సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ భేటీ అయ్యారు. అవినీతి కేసుల దర్యాప్తులో పరస్పర సహకారానికి ఈ ఉన్నతాధికారులు నిర్ణయించినట్లు సమాచారం.

ఎఫ్‌డీఐలతో భారత వ్యాపార రంగం విదేశీ సంస్థల హస్తగతం

విజయవాడ: విదేశీ సంస్థలు పెద్దయెత్తున లంచాలు ఇచ్చి, లాబీయింగ్‌ చేసి, భారత వ్యాపారంగాన్ని హస్తగతం చేసుకోవడానికి సద్దమైనాయని ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌ అన్నారు. ఈరొజు విజయవాడలో గాంధీనగర్‌ ఛంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ భవనంలో ‘రిటైల్‌ రంగంలో విదేశీ పెట్టుబడులు,…

సిక్కింలో కోండ చరియలు విరిగి పడి 24 మంది మృతి

  గ్యాంగ్‌ టాక్‌ ఈ శాన్య రాష్ట్రాలను వరదలు ముంచెత్తుతున్నాయి భారీ వర్షాల కారణంగా ఉత్తర సిక్కింలోని చుంగ్‌ తాంగ్‌ ప్రాంతంలో కోండ చరియలు విరిగిపడి 24 మంది మృతి చెందారు. మృతుల్లో ఇండోటిబెటన్‌ భద్రతా సిబ్బంది (ఐటీబీపీ)…

ప్రజలపై మరింత భారం వేయడం సరికాదు:సీఎంకు రాఘవులు లేఖ

హైదరాబాద్‌: డీజిల్‌ ధరల పెంపు, గ్యాస్‌ సిలిండర్ల కుదింపు సమస్యలతో సతమ తమవుతున్న ప్రజలపై వ్యయసర్దుబాటు పేరుతో మరింత భారం వేయడం సరికాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు ముఖ్యమంత్రికి లేఖ రాశారు. విద్యుదుత్పత్తి సామర్ధ్యాన్ని పెంచాలనే…

ఇందూరులో ‘ మార్చ్‌’ సన్నాహక కవాతు

నిజామాబాద్‌: సెప్టెంబర్‌ 30న జరిగే తెలంగాణ మార్చ్‌కు సన్నాహక కవాతు ఈ రోజు ఇందూరు నగరంలో జరిగింది. నెహ్రూెపార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించి అమరవీరుల ఆశయాలు సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ప్రారంభమైన కవాతు తెలంగాణ…

బ్యాటింగ్‌ ఎంచుకున్న పాకిస్ధాన్‌

పల్లెకెలె: టీ 20 ప్రపంచకప్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌లో నేటి తొలిమ్యాచ్‌లో న్యూజిలాండ్‌ల- పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌కి టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది.

ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో దీపికకు రజతం

టోక్యో: టోక్యోలో జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారతీయ క్రీడాకారిణీ దీపికా కుమారి రజతపతకం సాధించింది. దక్షిణ కొరియాకు చెందిన ప్రపంచ నెంబర్‌వన్‌ క్రీడాకారిణీ బోబేకితో తపడిన దీపిక ఓడిపోవడంతో రజతపతకంతో సరిపెట్టు కోవాల్సి వచ్చింది.

ఆర్టీసీ ఛార్జీలను పెంచిన ప్రభుత్వం

హైదరాబాద్‌: ఇప్పటికే పెరిగిన ధరలతో సతమవుతున్న  సామాన్యులకు మరో భారం నెత్తిన పడింది. ఆర్టీసీ కి అదనపు భారం మీద పడింది.దీంతో నష్టాల్లో కోనసాగుతున్న ఆర్టీసీకి వేరే ప్రత్యామ్నాయం లేక ఛార్జీలు పెంచింది. పెంచిన ఛార్జీలు ఈ ఆర్థరాత్రి…

హెరిటేజ్‌ మారథాన్‌ నిర్వహణ అభినందనీయం: స్పీకర్‌

హైదరాబాద్‌: దేశ చరిత్రలో మొదటిసారిగా చారిత్రక కట్టడాల మధ్య రన్‌ నిర్వహించడం అభినందనీయమని శాసనసభాపతి నాదెండ్ల మనోహర్‌ అన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చారింత్రక నేపథ్య కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ఆయన సూచించారు.…

రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రిదే: ధర్మాన

హైదరాబాద్‌: తన రాజీనామాపై తుది నిర్ణయం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిదే అని మంత్రి ధర్మాన  ప్రసాద్‌రావు తెలియజేశారు. వాన్‌పిక్‌ వ్యవహారంపై నిన్న రాత్రి సీఎంను కలిసి వివరణ ఇచ్చానని మంత్రి చెప్పారు. సీబీఐ తనపై మోపిన అభియోగాలపై సీఎం వివరణ…