Wednesday, 11 November 2026

వార్తలు

సర్కారు వైఖరితోనే విద్యుత్‌ సంక్షోభం: జేపీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో సర్కారు వైఖరితోనే విద్యుత్‌ సంక్షోభం నెలకొందని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ నారాయణ విమర్శించారు. సర్కారు నిర్లక్ష్యం వల్లనే విద్యుత్‌ సంస్థలు రూ. 7.400 కోట్ల రూపాయలు నష్టపోయాయని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల తీరుపై జేపీ…

తెలంగాణపై కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది: శంకర్రావు

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై తెలంగాణ మార్చ్‌లోగా కేంద్రప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అశాభావాన్ని మాజీ మంత్రి శంకర్రావు వ్యక్తం చేశారు. విధానసభ పదేపదే వాయిదా పడటం బాధాకరమన్నారు.

భూపతి, బోపన్నలకు కోర్టులో వూరట

బెంగుళూరు: టెన్నిస్‌ క్రీడాకారులు మహేశ్‌భూపతి, రోహన్‌  బోపన్నలకు కోర్టులో వూరట లభించింది. వీరిపై ‘ఐటా’ విధించిన నిషేధంపై కర్ణాటక హైకోర్టు స్టేఇచ్చింది.

గాంధీ భవన్‌ చేరిన బాపూజీ అంతిమ యాత్ర

హైదరాబాద: కొండా లక్ష్మణ్‌ బాపూజీ భౌతికకాయం గాంధీభవన్‌కు చేరుకుంది. అక్కడ ఆయన మృతదేహానికి పీసీసీ చీఫ్‌ బొత్స, డీఎస్‌, ఇతర కాంగ్రెస్‌ నేతలు నివాళులు అర్పించారు.

అసెంబ్లీ తీరు చూస్తే బాధగా ఉంది: చంద్రబాబు

హైదరాబాద్‌: అసెంబ్లీ తీరు చూస్తే బాధగా ఉందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం  చేశారు. నాయకుల తీరుతో ప్రజలకు అసెంబ్లీపై నమ్మకం పోయిందన్నారు. చర్చలు జరిగితే ఇబ్బందిపడతామని ప్రభుత్వం భావిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. అసెంబ్లీ నడపడం…

తెలంగాణ మార్చ్‌ ప్రచారయాత్రకు ఘన స్వాగతం

  అబ్దుల్లాపూర్‌మెట్‌ తెలంగాణ మార్చ్‌ విజయవంతానికి రంగారెడ్డి జీల్లా జేఏసీ అధ్వర్యంలో నిర్వహించిన ప్రచారయాత్ర గౌరెల్లి గ్రామం గుండా హయత్‌నగర్‌ మండలంలోకి ప్రవేశించింది స్థాసిక తెరాస, తెదేపా, జేఏసీ నేతలు ఘన స్వాగతం పలికారు. యాత్రకు నేతృత్వం వహిస్తున్న…

ఈ నెల ’29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన’

హైదరాబాద్‌: ఈ నెల ’29న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వస్తుందని మాజీమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత శంకర్రావు జోస్యం చెప్పారు. అసెంబ్లీ లాబీలో ఆయన శనివారం టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యులను ఉద్దేశించి  అన్ని అన్నారు. ఇక తెలంగాణ…

ప్రైవేటు పాఠశాల ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లో ఓ ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం చేసింది. యాజమాన్యం వేధింపుల కారణాంగా ఉద్యోగిని ఈ ఘటనకు పాల్పడిందని ఆమె బంధువులు పాఠశాల ముందు ఆందోళనకు దిగారు.

జీవ వైవిధ్య సదస్సును ఎవరూ అడ్డకోవద్ద: ముఖ్యమంత్రి

హైదరాబాద్‌: నగరంలో జరుగునున్న జీవ వైవిధ్య సదస్సును ఎవరూ అడ్డుకోవద్దని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కోరారు. రాష్ట్ర ప్రతిష్ఠను పెంచే ఈ సదస్సుకు పార్టీల తోపాటు ప్రజలు సహకరించాలన్నారు, భవిష్యత్‌లో అంతర్జాతీయ ఎలర్జీ, వ్యవసాయ సదస్సులు రాష్ట్రంలో జరగనున్నాయని తెలియజేశారు.…

మూడోసారి శాసనసభ వాయిదా

హైదరాబాద్‌: సమావేశాలు చివరి రోజు శాసనసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. రెండుసార్లు వాయిదా పడ్డ అనంతరం తిరిగి ప్రారంభమైన సభలో మళ్లీ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.తెలంగాణపై తీర్మానానికి టీఆర్‌ఎస్‌  ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టి వారు నిరసన…