Wednesday, 11 November 2026

వార్తలు

జార్ఖండ్‌లో ఎదురుకాల్పులు

రాంచీ: జార్ఖండ్‌ రాష్ట్రంలోని ఛాత్రా జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. గాయాలైన వారిలో ఓసీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ ఉన్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నట్లు సమాచారం

నేటి నుంచి టీ -20 వరల్డ్‌ కప్‌

కొలంబో: టీ-20 వరల్డ్‌ కప్‌ పోటీలు ఈ రోజు నుంచి మహీంద్ర రాజపక్సే అంతరాజతీయ స్టేడియంలో ప్రారంభం కానున్నాయి. ఈ మ్యాచ్‌లో పన్నెండు జట్లు 27 మ్యాచ్‌లు ఆడుతాయి. 20 రోజులపాటు అంటే ఆక్టోబర్‌ 7 ఈ పోటీలు…

ఎంజీఎంలో ముగ్గురు చిన్నారులు మృతి

వరంగల్‌: ఎంజీఎంలో శిశు మరణాలు కొనసాగుతున్నాయి. ఆసుపత్రి పిల్లల విభాగంలో చికిత్స  పొందుతూ కవలలతోపాటు మరో చిన్నారి మృతి చెందింది. ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ పిల్లలు మృతి చెందరాని తల్లిదండ్రులు, బంధువులు ఆసుపత్రిలో ఆందోళనకు దిగారు.

గన్‌పార్క్‌ వద్ద తెదేపా ఎమ్మెల్యేల ఆందోళన

హైదరాబాద్‌: ప్రభుత్వం నుంచి అవినీతి మంత్రులను తొలగించాలని తెదేపా ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. అసెంబ్లీకి ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌ వద్ద ఈ ఉదయం భైఠాయించి నిరసన చేపట్టారు. అవినీతి మంత్రులను వెంటనే తొలగించాలని డిమాండ్‌ వ్యక్తం చేశారు.

వాయిదా తీర్మానాలను తిరస్కరించిన స్పీకర్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. వివిధమైన అంశాలపై విపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలో ఆందోళనకు దిగారు. తెరాస సభ్యులు స్పీకర్‌ పోడియం వద్ద నిరసన…

స్పీకర్‌ పోడియం వద్ద తెరాస ఆందోళన

హైదరాబాద్‌: తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌  చేస్తూ తెరాస సభ్యులు రెండో రోజు కూడా శాసనసభలో ఆందోళనకు దిగారు. ఈ రోజు సమావేశాలలొ ప్రారంభం కాగానే స్పీకర్‌ పోడియం వద్దకు చేరిన సభ్యులు నిరసనకు దిగారు. తెలంగాణపై వెంటనే…

కోదండరాంపై కేసు నమోదు

కరీంనగర్‌: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాజకీయ జేఏసీ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కోదండరాంపై కరీంనగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. కరీంనగర్‌ రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఐపీసీ 153, 153(ఏ) సెక్షన్‌ల…

జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లతో సీఎం ముఖాముఖి

హైదరాబాద్‌: ప్రతిష్టాత్మకంగా జరగనున్న జీవ వైవిధ్య సదస్సులో వాలంటీర్లు సమర్థమైన పాత్ర పోసించాలని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. గచ్చిబౌలిలోని నేషనల్‌ ఇనిస్టిట్యుట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్టిఆలిటీ మేనేజ్‌మెంట్‌లో ఆయన వాలంటీర్లతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. శిక్షణ పొందుతున్న…

మహిళలకోసం ఎన్నో చట్టాలు ఉన్నా వాటి అమలులో లోపాలు జాప్యం: సుభాషణ్‌రెడ్డి

హైదరాబాద్‌: దశాబ్దాలుగా మహిళలు ఇంటా బయటా వివక్షకు గురవుతూనే ఉన్నారని మానవహక్కుల కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ సుభాషణ్‌రెడ్డి అన్నారు. బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన అంకురం వ్వవస్థాపక దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. మహిళలకోసం ఎన్నో చట్టాలు…

బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను ప్రశ్నించిన సీబీఐ

న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణంలో ఏఎంఆర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ అరవింద్‌ జైశ్వాల్‌ను సీబీఐ సోమవారం ప్రశ్నించింది. ఏఎంఆర్‌కు మహా రాష్ట్రలోని బందేర్‌ బొగ్గు బ్లాక& కేటాయింపు వ్వవహారంలో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలున్నాయి. గతంలో తనకు…