Wednesday, 11 November 2026

వార్తలు

ముఖ్యమంత్రిని కలిసిన గద్దర్‌

మహబూబ్‌నగర్‌: ఇందిరమ్మబాట కార్యక్రమంలో భాగంగా మహబూబ్‌నగర్‌లో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఈ రోజు గద్దర్‌ కలిశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లా ఎత్తి పోతల పథకాన్ని అమలుచేయాలని కోరుతూ ఆయన సీఎంకు వినతి పత్రం సమర్పించారు.

ఈ నెల 20 భారత్‌ బంద్‌: వెంకయ్యనాయుడు

ఢిల్లీ: అవినీతికి వ్యతిరేకంగా ఈ నెల 20న భారత్‌ బంద్‌ నిర్వహిస్తున్నట్లు భాజపా సీనియర్‌ నేత వెంకయ్యనాయుడు ప్రకటించారు. అవినీతి యూపీఏ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని ఆయన అన్నారు. బొగ్గు కుంభకోణం అవినీతిని పక్కదారి పట్టించేందుకే…

బీఏసీ సమావేశం నుంచి తెదేపా వాకౌట్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలను 15 రోజులు నిర్వహించాలని సభలో 20 అంశాలపై చర్చించాలని బీఏసీలో తెదేపా పట్టుబట్టింది. నాలుగు రోజులు మాత్రమే సమావేశాలు నిర్వహించాలన్ని నిర్ణయంపై తెదేపా సభ్యులు మండిపడ్డారు. ప్రభుత్వ వైఖరికి నిరపరగా సమావేశం నుంచి…

ఐఎస్‌ఎస్‌ బాధ్యతలు స్వీకరించిన సునీతా విలియమ్స్‌

న్యూయార్క్‌: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌) బాధ్యతలను స్వీకరించింది. ఈ బాధ్యతలు స్వీకరించిన రెండో మహిళ సునీత.కమాండర్‌ గెన్నడీపదల్క నుంచి ఆమె ఈ బాధ్యతలను తీసుకుంది. ఐఎస్‌ఎన్‌లో సేవలు అందిస్తున్న…

నేడు తెరాస శాసనసభాపక్షం భేటీ

హైదరబాద్‌: తెరాస శాసనసభాపక్షం నేడు భేటీ కానుంది. రేపటి నుంచి శాసనసభ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపధ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు చర్చించనున్నారు. తెలంగాణపై తీర్మానం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ వ్యక్తం చేస్తూ సమావేశాలను అడ్డుకోవాలని నేతలు…

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ప్రయాణికుల ఆందోళన

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో జెట్‌ ఎయిర్‌వేస్‌ కౌంటర్‌ వద్ద ప్రయాణికులు ఆందోళనకు దిగారు. సామర్థ్యానికి మించి 38 టికెట్లను ఎక్కువగా ఆన్‌లైన్‌లో బుక్‌ చేసినట్లు ఆరోపించారు. రేపు ముంబయిలో జరగాల్సిన మిన్‌ యూనివర్స్‌ పోటీలో పాల్గొనాల్సిన 38 మంది…

సుత్తివేలు మృతికి సినీ ప్రముఖుల సంతాపం

హైదరాబాద్‌: అనార్యోగంతో  న్నుమూసిన ప్రముఖ హాస్యనటుడు సుత్తివేలుకు పలువురు సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. చెన్నైలో ఆయన భౌతికకాయానికి నివాళులు అర్పించేందకు పలువురు బయలుదేరివెళ్లారు. ఆయన అంత్యక్రియలు చెనైకనలో ఈ సాయంత్రం నిర్వహిస్తామని కుటుంబసభ్యులు తెలియజేశారు.

కోర్టు భవనానలు పరిశీలించిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి

విజయవాడ: రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి పి.సి. ఘోష్‌ విజయవాగలోని కోర్టు భవనాలను పరిశీలించారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా నిన్న ఆయన విజయవాడకు వచ్చారు. బెజవాడ బార్‌ అసోసియేషన్‌ భవనంలో నూతనంగా నిర్మంచిన రెండో అంతస్తును…

రహదారిలో కూరుకుపోయిన లారీలు… స్తంభించచిన ట్రాఫిక్‌

కమలాపూర్‌: కరీంనగర్‌ జిల్లా కమలాపూర్‌ మండలం శనిగరం శివారులో రెండు బొగ్గు లారీలు రహదారిలో కూరుకుపోయాయి. దీంతో ఈ మార్గంలో రెండు కిలోమీటర్ల ట్రాఫిక్‌ స్తంభించడంతో వాహనాలను దారిమళ్లించారు. ఇటీవల కురిసన వర్షాలకు రోడ్డు పూర్తిగా పాడవడంతో లారీలు…

మూడు వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం

గుంటూరు: సత్తెనపల్లి గడియారం స్తంభం వద్ద మూడు వస్త్ర దుకాణాల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. విద్యుత్‌ షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు చెలరేగి భారీగా ఎగసిపడుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదంలో లక్షల్లో…