Wednesday, 11 November 2026

వార్తలు

తమ్మిలేరు జలాశయానికి భారీగా వరద నీరు

దెందులూరు: ఎగువ నుంచి వస్తున్న వరదతో పశ్చిమగోదావరి జిల్లా నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు జలాశయం నీటిమట్టం పెరుగుతోంది.ప్రాజెక్టులో నీటిమట్టం 348 అడుగులకు చేరుకోవడంతో 4,400 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి అంతే మొత్తంలో ఇన్‌ఫ్లో…

ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా

నిజామాబాద్‌: దోమకొండ మండలం అంబారిపేట వద్ద ప్రైవేటు పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈఘటనలో 15 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. పలువురిని బస్సు నుంచి స్థానికులు రక్షించారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రి తరలించారు.

లాభాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లకు పైగా లభాపడింది. అటు నిఫ్టీ కూడా 20 పాయింట్లకుపైగా లాభంతో కొనసాగుతోంది.

15 నుంచి టీజాక్ట్‌ బస్సు యాత్ర

న్యూఢిల్లీ: ‘ తెలంగాణ మార్చ్‌’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఈనెల 15 నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఉపాధ్యాయ సంఘాల ఐకాస (టీజాక్ట్‌) ప్రకటించింది.. మంగళవారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు…

లిబియాలో యూఎన్‌ కాన్యులేట్‌పై ఆందోళనకారుల దాడి

లిబియా: లిబియాలోని బెంగాజీ నగరంలో అమెరికా కాన్సులేట్‌పై నిరసనకారులు దాడులకు దిగారు. ఈ ఘటనలో ఓ అమెరికాన్‌ ఉద్యోగి మృతి చెందగా… పలుపురు గాయపడ్డారు. మతపరంగా అవమానపరిచే విధంగా ఉన్న ఓ అమెరికా సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనకారులు ఈ…

జంట నగరాల్లో ముఖ్యమంత్రి పర్యటన

హైదరాబాద్‌: జంట నగరాల్లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి బుధవారం ఉదయం పర్యటించారు. అంతర్జాతీయ జీవ వైవిద్య సదస్సు ఏర్పాట్లను సీఎం స్వయంగా పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట జీహెచ్‌ఎంసీ మేయర్‌, కమిషనర్‌, అధికారులు ఉన్నారు.

నేడు జైలు నుంచి కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ విడుదల

ముంబయి: దేశద్రోహం కేసులో అరెస్టుయిన కార్టునిస్టు అసీమ్‌త్రివేదీ నేడు జైలు నుంచి విడుదల కానున్నారు. ముంబయి హైకోర్టు నిన్న త్రివేదీకి బెయిల్‌ మంజూరు చేసింది. కేవలం కార్టున్లు గీయడమే ఆయనపై ఉన్న ఆరోపణ అయితే కస్టడీ అవసరం లేదని…

పాక్‌లో రెండు భారీ అగ్ని ప్రమాదాలు…45 మంది మృతి

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో వేర్వేరు ప్రాంతాల్లో భారీ అగ్ని ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల్లో మొత్తం 45 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. కరాచీలోని హబ్‌రివర్‌ రోడ్‌లోని ఓ వస్త్ర ఉత్పత్తులకు సంబంధించిన ఫ్యాక్టరీలో ఆగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.…

కర్ణాటకలో రోడ్డు ప్రమాదం.. తిరుపతివాసి మృతి

తిరుపతి: కర్ణాటక రాష్ట్రంలోని హోన్‌కోట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో అలిపిరి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు కండెక్టర్‌ మునుస్వామి మృతి చెందాడు. తిరుపతి నుంచి హోన్‌కోట ఆర్టీసీ బస్సు నిన్న రాత్రి బయలు దేరింది. ఈ ఉదయం…

గాలి బెయిలు కేసులో నిందితులకు రిమాండ్‌ పొడిగింపు

హైదరాబాద్‌: గాలి బెయిలు కుంభకోణం కేసులో అరెస్టైన హైకోర్టు రిజిస్ట్రార్‌ లక్ష్మీనరసింహారావు, మాజీ జడ్జి ప్రభాకరరావు, గాలి బంధువు దశరధరామిరెడ్డిల రిమాండ్‌ను ఏసీబీ కోర్టు మరో 14 రోజులు పొడిగించింది. ఈ రోజుతో రిమాండ్‌ గడువు ముగియడంతో చర్లపల్లి…