Wednesday, 11 November 2026

వార్తలు

మంత్రుల విదేశీ పర్యటనల వివరాలు బహిరంగ పరచండి

న్యూఢిల్లీ: కేంద్ర మంత్రులు, సీనియర్‌ అధికారులు చేపట్టే దేశీ, విదేశీ పర్యటనల వివరాలను బహిరంగ పరచాలని కేంద్రం వివిధ మంత్రిత్వశాఖలకు సూచించింది. అధికారిక పర్యటన స్వభావం, సందర్శించిన ప్రాంతాలు, పర్యటన కాలం, అధికారుల బృంద సంఖ్య, మంత్రి లేదా…

తెలంగాన ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులన్నిటినీ వెంటనే ఎత్తివేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ ఐకాస, టీయూ ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ధర్నా శిబిరం వద్దకు వెళ్తున్న గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య కొంతసేపు…

కార్మికుల సమస్యలపౌ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా: హరీష్‌రావు

హైదరాబాద్‌: కార్మికుల అభుయన్నతి కోసం సమర్ధమైన చట్టాలు ఉన్నా వాటిని అమలు చేయటంలో ప్రభుత్వాలు విఫలం అవుతున్నాయని తెరాస ఎమ్మెల్యే టి.హరీష్‌రావు విమర్శించారు. విద్యుత్తు శాఖలో పనిచేస్తున్న కార్మికులు శ్రమదోపిడికి గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాన…

ప్రైవేటు డిగ్రీ కళాశాల నిర్వాకం

మహబూబ్‌నగర్‌: కానిస్టేబుల్‌ ఉద్యోగం కోసం ధ్రువపత్రాలు ఇవ్వాలంటూ కళాశాలకు వెళ్లిన విద్యార్థిని కళాశాల నిర్వాహకులు గదిలో పెట్టి తాళం వేశారు. ఫీజు పూర్తిగా చెల్లిస్తేనే ధ్రువపత్రాలు ఇస్తామంటూ నిర్వాహకులు వేధాస్తున్నారని విద్యార్థి ఆరోపించాడు.

ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

చెన్నై: న్యూజిలాండ్‌తో ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. 2 పరుగుల వద్ద న్యూజిలాండ్‌ రెండో వికెట్‌ కోల్పోయింది. గుప్తిల్‌ ఒక పరుగుతోనే ఔటయ్యాడు. ఫిట్‌నెస్‌ లేని కారణంగా సెహ్వాగ్‌ ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు.

రెండో ఏడాది పబ్లిక్‌ ఇష్యూకి వచ్చిన ‘రెలిగేర్‌’

హైదరాబాద్‌: బ్యాంకింగేతర ఆర్థిక రంగంలో సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమలకు చేయూత నిస్తున్న రెలిగేర్‌ సంస్థ వరుసగా రెండో ఏడారి పబ్లిక్‌ ఇష్యూకి వచ్చింది. దేశంలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు గాను తమ సంస్థ పబ్లిక్‌ ఇష్యూలోకి అడుగుపెట్టిందని…

పాఠశాలల్లో క్రీడలు తప్పనిసరి

హైదరాబాద్‌: రాష్ట్రంలోని పాఠశాలల్లో క్రీడల్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. ఈ మేరకు విడుదల చేసిన బీవో నెంబరు 63 ప్రకారం రాజధాని హైదరాబాద్‌లోని పాఠశాలల్లో క్రీడల కోసం ఓ పిరియడ్‌ను తప్పనిసరి చేయటంతో…

వికలాంగుల సంక్షేమానికి రూ.45కోట్లు కేటాయించాలి

హైదరాబాద్‌: వికలాంగుల న్యాయమైన హక్కుల సధన కోసం ఎమ్మార్పీఎస్‌ వ్వవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ హైదరాబాద్‌ – మలక్‌పేట, నల్గొండ క్రాస్‌ రోడ్డులో మూడు రోజుల దీక్ష చేపట్టారు. దీక్షకు వికలాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వికలాంగుల పింఛనును…

తెలంగాణ ఉద్యోగుల పనరంకిత సభ

హైదరాబాద్‌: ఈ నెల 13న ఇందిరాపార్కు వద్ద సకలజనుల సమ్మెను పురస్కరించుకుని తెలంగాణా ఉద్యొగులతో పనరంకిత సభను నిర్వహించనున్నట్లు టీఎన్జీఓ అధ్యక్షుడు దేవీప్రసాద్‌ తెలిపారు. ఈ నెల 3న తెలంగాణ మార్చ్‌లో ఉద్యోగులంతా పాల్గొననున్నట్లు దేవీప్రసాద్‌ చెప్పారు. పదో…