Wednesday, 11 November 2026

వార్తలు

పాదయాత్రపై పార్టీ సీనియర్లతో బాబు చర్చలు

హైదరాబాద్‌: పాదయాత్రపై చర్చించేందుకు పార్టీ సీనియర్లతో చంద్రబాబు మంగళవారం సమావేశమయ్యారు. పారయాత్ర ఎప్పుడు, ఎక్కడి నుంచి ప్రారంభించి ఎక్కడ ముగించాలన్న అంశంపై చర్చించారు.

ఐఏఎస్‌ అధికారుల బదిలీ

హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీ అయ్యారు. ఏపీఐడీ సీఎండీగా షలినీ మిశ్రా, కార్మికశాఖ కమిషనర్‌గా రామాంజనేయులు, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శిగా అజయ్‌ సహానీ, స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ కమిషనర్‌గా వి.కె. అగర్వాల్‌, సాఘిక సంక్షేమశాఖ ముఖ్య…

ఎమ్మెల్యేల ఆస్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతా: మనోహర్‌

హైదరాబాద్‌: శాసనసభ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యేలోగా ఎమ్మెల్యేల ఆస్థుల వివరాలను వెబ్‌సైట్‌లో పెడతామని సభాపతి నాదెండ్ల మనోహర్‌ తెలిపారు. ఈ నెల 16న ఉదయం 11గం.కు జరిగే శాసనసభ వ్వవహారాల సలహా సంఘం సమావేశంలో వర్షాకాల సమావేశాల అజెండాను…

15రోజులకు తగ్గకుండా శాసనసభ సమావేశాలు నిర్వహించాలి: సీపీఐ

హైదరాబాద్‌:ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలను 15 రోజులు తగ్గకుండా నిర్వహించాలని సీపీఐ ప్రభుత్వాన్ని, స్పీకర్‌ని కోరింది. మూడు సంవత్సరాల కాంగ్రెస్‌ పార్టీ పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమయ్యిందని ఆ పార్టీ శాసనసభ పక్ష…

తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలి: దాడి వీరభద్రరావు

హైదరాబాద్‌: తెలంగాణపై టీడీపీ వైఖరి మారనప్పుడు మరోసారి లేఖ ఇవ్వాల్సిస అవసరం ఏముందని ఆ పార్టీ సీనియర్‌ నేత దాడి వీరభద్రరావు అన్నారు. అయినా తెలంగాణపై ఎన్ని లేఖలు ఇవ్వాలని, లేఖ ఇచ్చినా మళ్లీమళ్లీ అడగరని సమ్మరమేంటని ప్రశ్నించారు.…

తెలంగాణపై భిన్నస్వరాలు వినిపించటం తగదు

హైదరాబాద్‌: తెలంగాణపై యూపీఏ భిన్న స్వరాలు వినిపించటంపై సీపీఐ మండిపడింది. రాజకీయపార్టీలను ఏర్పాటు చేస్తామని ప్రధానమంత్రి మాట్లాడుతుండగా  కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే ఇప్పట్లో అఖిలపక్షం సమావేశం లేదని మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఆ పార్టీ శాసనసభాపక్ష…

బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు పూర్తి

హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో బ్రహ్మానందరెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై సీబీఐ కోర్టులో వాదనలు పూర్తియ్యాయి. బ్రహ్మానందరెడ్డి బెయిల్‌పై తీర్పును న్యాయస్థానం ఈ నెల 17కు వాయిదా వేసింది.

కాకినాడ మిలటరీ క్యాంటీన్‌ ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసుల దాడి: నలభై మంది అరెస్టు

తూర్పుగోదావరి: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ మిలటరీ క్యాంటీస్‌ ప్రాంతంలో పేకట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట అడుతున్న నలభై మందని అరెస్టు చేశారు. వారి వద్దనుంచి రూ. రెండు లక్షల నగదు, 50 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం…

కరువు మండలాలకు ఉపాధి హామీ పొడిగింపు

హైదరాబాద్‌: కరవు మండలాలు ప్రకటించిన ప్రాంతాల్లో ఉపాధి హామీని అదనంగా మరో 50 రోజులు పొడిగించనున్నట్లు మంత్రి మాణిక్యవరప్రసాద్‌ పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోగా కరువు మండలాల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలియజేశారు.

సమాజ పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలి:సుఫ్రీంకోర్టు

న్యూడిల్లీ : వార్తను ప్రసారం చేయడం లేదా ముద్రించే ముందు పరిరక్షణను మీడియా దృష్టిలో ఉంచుకోవాలని సుప్రింకోర్టు సూచించింది కోర్టు విచారణలో ఉన్న వార్తల ప్రచరణ అంశంపై ఈరోజు సుప్రిం తీర్పును వెలువరించింది కోర్టు కార్యకలాపాల ప్రచురుణపై సముచిత…