Wednesday, 4 November 2026

తెలంగాన ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమకారులపై పెట్టిన అక్రమ కేసులన్నిటినీ వెంటనే ఎత్తివేయాలంటూ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఓయూ ఐకాస, టీయూ ఐకాస ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా చేపట్టారు. ధర్నా శిబిరం వద్దకు వెళ్తున్న గద్దర్‌ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిమధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. నక్సల్స్‌తో చర్చల సందర్భంగా అడ్డుకోని ప్రభుత్వం విద్యార్థుల ధర్నాకు హాజరవుతుంటే అడ్డుపడుతోందని విమర్శించారు. తెలంగాణా ఉద్యమకారులపై ప్రభుత్వం ఏకపక్షవైఖరిని అవలంబిస్తోందని ఇందుకు నిరసనగా ముఖ్యమంత్రి ఛాంబర్‌ ముందు దీక్ష చేస్తానని గద్దర్‌ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *