Wednesday, 11 November 2026

వార్తలు

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మాక్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 90 పాయింట్లకుపైగా నష్టపోయింది. అటు నీఫ్టీ కూడా 31 పాయింట్లకుపైగా నష్టంతో కొనసాగుతోంది.

భారీగా ఎచ్రందనం దుంగలు పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నాగయ్యగారిపాలెం సమీపంలో స్వర్ణముఖి వాగులో పాతి పెట్టిన సుమారు 100కు పైగా ఎర్రచందనం దుంగలను స్పెషల్‌ బ్రాంచి పోలీసులు పట్టుకున్నారు. వీటి విలువ సుమారు. రూ. కోటిపైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.…

నేడు తితిదే పాలకమండలి భేటీ

తిరుమల : తితిదే నూతన పాలకమండలి తొలి సమావేశం నేడు జరగనుంది. అన్నమయ్య భవన్‌లో జరిగే ఈ సమావేశంలో తిరుమలలో నీటి కొరత, అధికమాస బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు తదితర అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.

వైఎస్‌ విజయను కలిసిన కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇవాళ వైఎస్సార్‌సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్‌ విజయను కలుసుకున్నారు. అసెంబ్లీ అవరణలో అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలని తెలంగాణ జాగృతి చేస్తున్న కృషికి  మద్దతు ఇవ్వాలని విజయను కవిత కోరారు.

నేడు భారత్‌-న్యూజిలాండ్‌ రెండో టీ -20 మ్యాచ్‌

చెన్నై: భారత్‌-న్యూజిలాండ్‌ల మధ్య ఇవాళ చిదంబరం స్టేడియంలో టీ -20 రెండో మ్యాచ్‌ ప్రారంభం కానుంది. విశాఖపట్నంలో తొలి టీ -20 మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయిన విషయం తెలిసిందే. దీంతో ఇక్కడ సాధించే గెలుపుతో సిరీస్‌ను ముగించాలని …

ఎర్రచందనం పట్టివేత

చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాస మంగాపురం సమీపంలోని కల్లేటివాగులో మంగళవారం ఉదయం పోలీసులు 60 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. రెండున్నర టన్నుల బరువుగల ఈ దుంగల విలువ రూ.60 లక్షలు ఉంటుందని తెలియజేశారు. తమిళనాడుకు…

అసోంలో నేడు రాహుల్‌ పర్యటన

న్యూఢిల్లీ: అసోంలో అల్లర్లు చోటుచేసుకున్న ప్రాంతాల్లో కాంగ్రెస్‌ ప్రధాన కార్యిదర్శి రాహుల్‌ గాంధీ నేడు పర్యటించనున్నారు. ఒక రోజు పర్యటనలో భాగంగా ఘర్షణలు చెలరేగిన డుబ్రీ, కోక్రాఝర్‌ జిల్లాలో రాహుల్‌ పర్యటించి పునరావాస శిబిరాల్లో బాధితులను పరామర్శించనున్నారు. ప్రధాని…

హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 20 మంది మృతి

షిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం ఉదయం అషపురి  జిల్లాలో ఓ బస్సు అదుపుతప్పి లోయలో పడింది. ఈ ప్రమాదంలో 20 మంది మృతి చెందగా… పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కంగాడ జిల్లా పాలంపూర్‌ నుంచి…

వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై దాడికి నేటితో 11 ఏళ్లు

వాషింగ్టస్‌: అమెరికాలోని వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌పై ఉగ్రవాదుల దాడి జరిగి  నేటికి 11 ఏళ్లు  పూర్తియ్యాయి.ఈ సందర్భంగా గ్రౌండ్‌ జీరో వద్ద మృతులకు అమెరికా అధ్వక్షుడు ఒబామా ఘన నివాళి అర్పించారు. అమెరికా పౌరుల రక్షణ కోసం ప్రభుత్వం…

తెలంగాణపై షిండే పరాచకాలు

లోతుగా అధ్యయనం చేయాలి ఇప్పట్లో అఖిలపక్షం లేదు న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 10 : తెలంగాణపై ఇప్పట్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసే అంశం ఏదీ పరిశీలనలో లేదని కేంద్ర హోంమంత్రి సుశీల్‌ కుమార్‌ షిండే చెప్పారు. తెలంగాణ సమస్య…