Wednesday, 11 November 2026

వార్తలు

కాకినాడలో భారీ వర్షం-లోతట్టు ప్రాంతాలు జల మయమయం

కాకినాడ: తూర్పు గోదవరి జిల్లా కాకినాడలో ఈ ఉదయం భారీ వర్షం కురిసింది దీంతో నగరంలోని లోతట్టు ప్రాంతాలు జల మయమయ్యాయి ప్రధాన రహదారులపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు భారీవర్షంతో కీకినాడ పోర్టు రైల్వేస్టేషన్‌…

పెట్రో ధరల పెంపుపై నేడు కేంద్ర మంత్రుల బృందం భేటీ

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌ ధరల పెంపుపై కేంద్రం తర్జనభర్జన పడుతోంది. ఈ అంశం పై నిర్ణయం తీసుకునేందుకు కేంద్ర రాజకీయ వ్యవహారాల మంత్రుల బృందం ఈ సాయంత్రం భేటీ అవనుంది. పెట్రోల్‌, డీజిల్‌, వంటగ్యాస్‌, కిరోసిన్‌ ధరల పెంపుపై…

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగర మార్కెట్‌లో బంగారం ధన స్వల్పంగా తగ్గింది.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 32,420గా ఉండగా…22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.31,100 ఉంది. కిలో వెండి ధర రూ. 62,800గా  పలుకుతోంది.

మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్‌ పోలీసుపై దాడి

శ్రీనగర్‌ : ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన మంత్రి కాన్వాయ్‌ని ఆపినందుకు ట్రాఫిక్‌ కానిస్ణేబుల్‌పై మంత్రి భద్రతా సిబ్బంది దాడికి దిగిన ఘటన జమ్మూ రాష్ట్రంలోని శ్రీనగర్‌లో చోటుచేసుకుంది రాష్ట్ర నీటిపారుదల వరద నియంత్రణ మంత్రి తాజ్‌మోహిద్దిన్‌ కాన్వాయ్‌ శ్రీనగర్‌లోని…

సీమాంద్ర నేతలతో చంద్రబాబు భేటీ-తెలంగాణ పై కేంద్రానికి లేఖ ఇచ్చే అంశం పై చర్చ

హైదరాబాద్‌ :సీమాంధ్ర నేతలతో తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు తెలంగాణ పై కేంద్రానికి లేఖ ఇచ్చే అంశం పై చంద్రబాబు నేతలతో చర్చిస్తున్నారు.

విజయమ్మ నివాసంలో కవిత

హైదరాబాద్‌: శాసనసభ ఆవరణలో అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరుతూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత లోటాస్‌పాండ్‌లోని వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ నివాసంలో కలిశారు. ఈ నెల 17నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీల…

నగల దుకాణంలో భారీ చోరీ

గుంటూరు: నగల దుకాణంలో భారీ చోరీ జరిగిన ఘటన గురజాలలోని కొట్లా బజారులో చోటుచేసుకుంది. ఇక్కడి ఓ నగల దుకాణంలో చోరులు కిలో బంగారం దొంగిలించారు. పోలీసులు  కేసు దర్యాప్తు చేస్తున్నారు.

నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్టు

విశాఖపట్నం: ఆంధ్రా- ఒడిశా సరిహద్దులోని జోలాపుట్‌ వద్ద నలుగురు గంజాయి స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 1.50 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.

విమాన ప్రయాణికుడి నుంచి బుల్లెట్లు స్వాధీనం

రంగారెడ్డి: శంషాబాద్‌ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహిస్తున్న  భద్రతా సిబ్బంది ఓ వ్యక్తి నుంచి  రెండు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన హనుమంతరావు అనే వ్యక్తి విశాఖపట్నం వెళ్తోండగా ఆయన నుంచి పోలీసులు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు.…

తమ్మిలేరు జలాశయంలోకి భారీగ వరద నీరు

చాట్రాయి: ఖమ్మం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు కృష్ణా జిల్లా తమ్మిలేరు జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో జలాశయం లాకులు ఎత్తి దిగువకు 4,500 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. జలాశయంలోకి ఇన్‌ఫ్లో…